Connect with us

News

ఆదోని మాజీ మున్సిపల్ కమిషనర్ కన్యాకుమారి మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ కార్యాలయంలో మాజీ మున్సిపల్ కమిషనర్ కన్యాకుమారి చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు. మునిసిపల్ పర్సన్ శాంత మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మరియు సిబ్బంది కౌన్సిలర్లు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ 2011 నుంచి 2014 వరకు మరియు 2019 నుండి 2020 వరకు ఆదోనిలో మున్సిపల్ కమిషనర్ గా కన్యాకుమారి విధులు నిర్వహించారని తెలిపారు. ఆమె చేసిన సేవలను ఆదోని ప్రజలు మరియు సిబ్బంది ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. మాజీ కమిషనర్ కన్యాకుమారి అనారోగ్యం తో హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు.

కన్యాకుమారి చిత్రపటానికి పూలమాల వేసి సి శ్రద్ధాంజలి ఘటిస్తున్న అధికారు
ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటిస్తున్న మున్సిపల్ అధికారులు

News

శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పరీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు
సంతకం చేస్తున్న కౌన్సిలర్ ఫయాజ్
Continue Reading

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

Trending