అదోనిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్

కర్నూలు జిల్లా అదోని పట్టణంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులని వన్ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… అదోని పట్టణంలోని అమరావతి నగర్, మారెమ్మ అవ్వ గుడి సమీపంలో మరియు ఆంజనేయ స్వామి దేవాలయం బావాజీపేట సమీపంలో గల ఇంటి వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అదోని వన్ టౌన్ ఏఎస్ఐ ఎం. తిరుమల నాయక్ తన సిబ్బందితో బాబాజీ పేటలో హెడ్ కానిస్టేబుల్ ఎస్. సత్తార్ వలీ అమరావతి నగర్ లో ఆకస్మిక దాడి నిర్వహించారు.

బాబాజీ పేట కు చెందిన బోయ నాగరాజు (49) మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుండి సుమారు 22 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం లో బెంగళూరు విస్కీ (180 ML) స్వాధీనం చేసుకుని నిందితుడిపై ఏపీ ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 34 (A) కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్ఐ ఎం తిరుమల నాయక్ తెలిపారు.

అమరావతి నగర్ కు చెందిన బోయ రామకృష్ణ (అలియాస్ రాముడు) (52) మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుండి సుమారు 16 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం లో 11 బాటిళ్ల ‘జాన్ ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్’ విస్కీ (180 ML), 05 బాటిళ్ల ‘మెక్ డోవెల్స్ నంబర్ 1 లగ్జరీ సుప్రీం’ విస్కీ (180 ML) స్వాధీనం చేసుకుని :నిందితుడిపై ఏపీ ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 34 (A) కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు హెడ్ కానిస్టేబుల్ సత్తార్ వలీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top