Connect with us

News

సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరు. గడ్డా ఫక్రుద్దీన్

Published

on

సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరని  టీడీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి, అనంతపురం జిల్లా గుంతకల్ మైనార్టీ అబ్జర్వర్ షేక్ బాబా ఫక్రుద్దీన్ అలియాస్ గడ్డా ఫక్రుద్దీన్ ఆనందం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో షేక్ బాబా ఫక్రుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ఆనాడు అన్న ఎన్టీఆర్ కిలో రెండు రూపాయలు బియ్యంతో సంక్షేమ పథకం తో చరిత్ర సృష్టిస్తే ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని అమలు చేసి  నారా చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారని తెలిపారు. సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని అమలు చేసి చూపించారని కొనియాడారు. ఆనాడు జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో వేసినా అమ్మ ఒడి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒకే సంవత్సరంలో తల్లికి వందనం వేసి తల్లుల కళ్ళల్లో  ఆనందాన్ని కూటమి ప్రభుత్వం చూడగలిగింది అన్నారు. పిల్లల్ని చదివిస్తే  రాష్ట్రానికి అతిపెద్ద సంపద వారేనని నమ్మి ఆచరణలో పెట్టి చూపిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే బులుగు బ్యాచ్ కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతుంది, కడుపు మంటతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని 2000 రూపాయలు లోకేష్ బాబు జేబులోకి పోయాయంటూ వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వం వైసీపీ పాలనలో 13000 ఇచ్చారు అంటే 2000 జగన్ జేబులోకి పోయినాయా? లేదంటే తాడేపల్లి ప్యాలెస్సుకుపోయినాయని? ఈ సందర్భంగా గడ్డా ఫక్రుద్దీన్ ప్రశ్నించారు? గత ప్రభుత్వం జగన్ పాలనలో  47 లక్షల మందికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 67 లక్షల మందికి ఈ పథకం లబ్ధి పొందురున్నారని అయితే గత ప్రభుత్వంలో కుటుంబంలో  ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి అమ్మఒడిఅమలు చేస్తానని చెప్పి కుటుంబంలో ఒక్కరికే అమ్మ ఒడి అమలు చేసి మధ్య తరగతి కుటుంబాలను మోసం చేసిన ఘనత  జగన్ కి దక్కుతుందని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధిని చూసి జగన్ మోహన్ రెడ్డి  తప్పుడు ప్రచారాలు చేయడం జగన్ దిగజారుడు రాజకీయానికి నిదర్శమని ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని  గడ్డా ఫక్రుద్దీన్ హితువు  పలికారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట

Published

on

ఆదోని, ఫిబ్రవరి 21:ఆదోనిలోని డి.సి.సి.బి (DCCB) బ్యాంక్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సంఘం నాయకులు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

సభలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లింగన్న

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:

  • వ్యవసాయానికి వెన్నెముక: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సాగు పెట్టుబడి నుంచి ఇతర సేవల వరకు ప్రాథమిక సహకార సంఘాలు ఎంతో మేలు చేస్తున్నాయని వారు కొనియాడారు.
  • ప్రభుత్వ బాధ్యత: సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు.
  • తక్షణ పరిష్కారం: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వారి న్యాయమైన కోర్కెలను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
సభలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లింగన్న

ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగులు, కార్మిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ

Published

on

ఆదోని, ఫిబ్రవరి 18:

ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగిందంటే?  కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే, ఆ తొందరలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండ్‌కు చేరుకుని డ్రైవర్‌ను సంప్రదించారు. బస్సులో వెతికినప్పటికీ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలు సాయంత్రం 3:30 గంటలకు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. సాయంత్రం 4:30 గంటలకు పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Continue Reading

News

నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి

Published

on

ఆదోని రూరల్, ఫిబ్రవరి 18:

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.

ఘటన వివరాలు:

​పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గుట్టల వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటు సారా బట్టిని పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.

భారీగా ఊట ధ్వంసం:

​పోలీసులు సారా బట్టి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన ఊటను తక్షణమే ధ్వంసం చేశారు. అలాగే, ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

నిందితుడి గుర్తింపు:

​పోలీసుల ప్రాథమిక విచారణలో, సారా బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు కుమారుడు బోయ శివగా తేలింది. స్థానిక పొలాల యజమానుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్యా శ్రీ తెలిపారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Continue Reading

Trending