News
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1268.9 కి.మీ.
ఈరోజు నడిచింది దూరం 16.2 కి.మీ.
100వ రోజు (15.05.2023) పాదయాత్ర వివరాలు
శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం(నంద్యాల జిల్లా)
ఉదయం
8.00 – బోయరేవుల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.00 – ముత్తుకూరులో స్థానికులతో మాటామంతీ.
10.10 – పెద్దదేవలాపురంలో స్థానికులతో మాటామంతీ.
11.20 – సంతజూటూరులో స్థానికులతో మాటామంతీ.
11.40 – సంతజూటూరులో చెంచు సామాజికవర్గీయులతో ముఖాముఖి.
12.40 – సంతజూటూరులో భోజన విరామం.
సాయంత్రం
4.00 – సంతజూటూరు నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.15 – పరమటూరు క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
6.10 – బండిఆత్మకూరులో స్థానికులతో మాటామంతీ.
6.35 – బండిఆత్మకూరు శివారు విడిది కేంద్రంలో బస.
News
తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు
హోస్పేట: 11.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 11 (మంగళవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1626.82 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 82.599 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 41167 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 39569 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1630 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 86.894 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డా పార్థసారథి పై రైతు సంఘం నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే డా.పార్థసారథి చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. వైసిపి నేతలు మూడు రోజులు దీక్ష చేసిన శిబిరాల వద్ద వెళ్ళి ఎమ్మెల్యే వివరణ చేయాలి కాని అధికార పార్టీలో ఉండి ప్రతి పక్ష పార్టీ ఆఫీస్ ను ముట్టడి చేస్తామనడం సిగ్గు చేటుఅని వెంకటేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తెలిపారు. అభివృధి మానేసే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే డా.పార్థసారథి అని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ ఆరోపించారు.
News
మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు, కార్మిక సంఘాల ఆందోళన
కేంద్ర కార్మిక సంఘాలు మరియు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా “జైల్ భరో” నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కలసికట్టుగా ఈ ఆందోళన చేపట్టాయి. అందులో భాగంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రధాన రహదారుల గుండా నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు ఎటువంటి సుంకం లేకుండా దిగుమతి అయి, దేశీయంగా పంటల ధరలు పడిపోతున్నాయని.. ◆ అదే సమయంలో మన ఉత్పత్తుల ఎగుమతులపై 25% సుంకం విధించడంతో తీవ్ర నష్టం జరుగుతోందని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ◆ ఢిల్లీ రైతు ఉద్యమ సమయంలో హామీ ఇచ్చిన విధంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, ప్రతీ రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ◆ కార్పొరేట్ సంస్థల కోట్లాది రూపాయల రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, రైతులపై కనికరం చూపకపోవడం దారుణమన్నారు. ◆ 44 కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ◆ ‘విబిసి రామ్‌జీ’ చట్టంతో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి దూరం చేస్తున్నారని విమర్శించారు.
◆ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర కరువు తాండవిస్తోందని, తుంగభద్ర నీరు సముద్రంపాలవుతున్నా శ్రీశైలం-హోస్పేట్ మధ్య కనీసం ఒక్క డ్యామ్ కూడా నిర్మించకపోవడం శోచనీయమన్నారు. ఆలూరు, ఆదోని ప్రాంతాలకు నీరందించే వేదవతి, గుండ్రేవుల, RDS ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఆదోని నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ప్రజలు చెంబులు-బిందెలతో నిరసన తెలుపుతున్నా అధికారులు, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ◆ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలైన మెడికల్ కాలేజీ, ఆటో గ్యారేజ్, మాస్టర్ ప్లాన్ అమలును వెంటనే పూర్తి చేయాలని, చిల్లర రాజకీయాను మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికైనా కంటితుడుపు రాజకీయం మాని, రైతులు, కార్మికులు మరియు ఆదోని ప్రాంత అభివృద్ధి సమస్యలపై తక్షణమే స్పందించాలని.. లేనిపక్షంలో పోరాటాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డా పార్థసారథి పై రైతు సంఘం నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే డా.పార్థసారథి చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. వైసిపి నేతలు మూడు రోజులు దీక్ష చేసిన శిబిరాల వద్ద వెళ్ళి ఎమ్మెల్యే వివరణ చేయాలి కాని అధికార పార్టీలో ఉండి ప్రతి పక్ష పార్టీ ఆఫీస్ ను ముట్టడి చేస్తామనడం సిగ్గు చేటుఅని వెంకటేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తెలిపారు. అభివృధి మానేసే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే డా.పార్థసారథి అని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ ఆరోపించారు.
-
News4 weeks ago
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News2 weeks ago
ఆదోనిలో నిధి కోసం క్షుద్రపూజలు
-
News4 weeks ago
BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు
-
News2 weeks ago
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల విజయం..
-
News3 weeks ago
ఆదోనిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ
-
News3 weeks ago
ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు
-
News3 weeks ago
జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన
-
News4 days ago
ఆదోని నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం