News
హైవే రోడ్ లో బైఠాయించి నిరసన.. అడ్డుకున్న పోలీసులు
కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మెడికల్ కాలేజ్ ప్రవెటీకరణను వ్యతిరేకిస్తు పి డి ఎస్ యు విద్యార్థి సంఘాలు హైవే రోడ్ పై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నరు. పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మెడికల్ కాలేజ్ పై కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పి పి పి పద్ధతిని రద్దు చేయాలి, వెంటనే కాలేజ్ పనులు పూర్తిచేసి తరగతులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు కే భాస్కర్ మాట్లాడుతూ…
చంద్రబాబు 30 ఏళ్లుగా సీఎం గా ఉన్న ఇంతవరకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకొని రాలేదు అన్నారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిదురిస్తూ ఇస్తున్న 40%తో మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేLయలేక పోతుందని ఇది చేతకానితనానికి నిదర్శనమై అన్నారు. కార్పొరేటర్లకు బూడిదం చేస్తున్నార ఆని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కార్పొరేట్ మెడికల్ మాఫియాకు అండగా మారిందని.. విద్యను నాశనం చేస్తున్న నారా లోకేష్ ను భర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజ్ అమ్ముకొని దండుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని చలనం లేకుండా ఉన్నాడని తెలిపారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఆపకపోతే సీఎం ఇల్లు మరియు అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ..
ప్రైవేటీకరణ ఆపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కుటుంబ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




