ముక్కుపచ్చలారని బాలిక పై ఆత్యాచారానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి.

ప్రతి ఒక్కరి కళ్ళలో కన్నీళ్లు తెచ్చి, మనసును కలచివేసిన ముక్కుపచలారని స్రవంతి అత్యాచారంపై భగ్గుమన్న బీసీ సంఘాలు..

ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శివన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల జిల్లా, పగిడియాల మండలం, ముచ్చుమర్రి గ్రామానికి చెందిన వాల్మీకి బోయ బీసీ బాలిక వాసంతి పై హత్యాచారానికి పాల్పడ్డ దుర్మార్గులను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్కులో ఆడుకుంటున్న అన్నెం పున్నెం ఎరుగని 9 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం-ఆపై హత్య చేసి, కాలువలో పడేసామంటున్న ఆ మానవ మృగాలపై చట్టపరమైన గట్టి చర్యలు గైకొనాలన్నారు. శోకసంద్రంలో మునిగిపోయిన చిట్టితల్లి వాసంతి కుటుంబ సభ్యులను, ప్రభుత్వ పెద్దలు వెంటనే కలిసి, పరామర్శించి, ఓదార్చాలన్నారు. అనాదిగా అవమానాలకు, అన్యాయాలకు, హత్యలు – అత్యాచారాలకు గురవుతూ వస్తున్నది, బలహీనవర్గాల ప్రజలు ముఖ్యంగా మహిళలు, బాలికలే నన్నారు. తొమ్మిదేళ్ళకే నిండు నూరేళ్లు నిండేలా హత్యాచారానికి పాల్పడ్డ దుండగులను భవిష్యత్తులో మరెవ్వరూ ఈ రకమైన దుశ్చర్యలకు పాల్పడకుండా, హెచ్చరికగా ఉండేలా, ప్రభుత్వం కఠిన చర్యలు గైకొని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షులు శ్రీ కేసన శంకర్రావు గుడిసె శివన్న జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి దేవేంద్ర కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top