Connect with us

News

ఆదోనిలో గడపగడపకు మన ప్రభుత్వం

Published

on

అవినీతి రహిత పాలన అమలుపరస్తు ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని 30వ వార్డు వడ్డే గేరిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పాలుగోన్న. ప్రతి గడపకు తిరుగుతూ వార్డుల సమస్యలు తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు కేవలం 4 సంవత్సరాల్లోనే 98 శాతం పథకాలు అందించే ఏకైక ప్రభుత్వం అని అన్నారు. ప్రజలు 2024 లో కూడా మా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే రెట్టింపు పథకాలు ప్రజలకు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఆదోని పట్టణ అధ్యక్షుడు బి దేవా మున్సిపల్ చైర్ పర్సన్ బోయే శాంత చంద్రకాంత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్టేట్ డైరెక్టర్లు రేణుక మున్సిపల్ చైర్ పర్సన్ బోయ శాంత వైస్ చైర్మన్ గౌస్ వాడి ఇన్చార్జి కౌన్సిలర్ ప్రతిభ లక్ష్మన్న తాయన్న తిమ్మప్ప బాలు శంకర్ కిషోర్ రామలింగేశ్వర యాదవ్ ముని బి.కే లక్ష్మన్న మన్మతి స్వామి చిన్న ఈరన్న సంజీవ్ లక్ష్మీనారాయణ రాము ఆనంద్ రంగా చిన్న వీరప్ప హరి భవాని మళ్లీ తదితరులు పాల్గొన్నారు

అంగన్వాడీలో గర్భిణీలకు కిట్లను అందజేసిన ఎమ్మెల్యే
యూట్యూబ్ వీడియో లింక్
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 29-08-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 36726 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 38894 క్యూసెక్కులు

Continue Reading

News

గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి.. ఆదోని సబ్ కలెక్టర్

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. గురువారం ఆదోని పట్టణంలో  నిమజ్జనం వెళ్లే ప్రధాన దారి అయినా , తిక్క స్వామికి దర్గా, ఎమ్మిగనూరు సర్కిల్, బీమా సర్కిల్, ఫరిసా మోహల్ల, శ్రీనివాస్ భవన్, గణేష్ సర్కిల్, న్యూ ఫ్లైవర్, వినాయక ఘాట్ ప్రధాన దారులను తనిఖీ చేసి పరిశీలించారు.

వినాయక కాటు వద్ద పరిశీలిస్తున్న అధికారులు

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… నిమజ్జనం కు ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా గణేష్ విగ్రహాల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తుతో నిమజ్జన ఏర్పాట్లకు చేయాలని పోలీసులను విగ్రహాలు వెళ్లే దారిలో రోడ్లో ఉండే ప్యాచ్ వర్క్ ను తర్వాత గతిన పూర్తి చేయాలని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు, విగ్రహాల ఊరేగింపు సమయంలో  విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లు ను అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఊరేగింపు జరిగే వీధుల్లో రోడ్డు కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇసుక, కంకర అడ్డు లేకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు తెలిపారు. నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా పకడ్బందీ నియంత్రణ చేపట్టాలని పోలీసులకు సూచించారు. కెనాల్ దగ్గర గజ ఈతగాలను ఏర్పాటు చేయాలని ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులను, మెడికల్ క్యాంప్ ఏఆర్పాటు చేయాలని వైద్యాధికారులకు, నిమజ్జనం సమయంలో క్రేన్లు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఉంచుకొని  ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం విజయవంతం చేయాలని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు.

అధికారులకు ఆదేశాలు ఇస్తున్న సబ్ కలెక్టర్


ఈ కార్యక్రమంలో డిఎస్పి హేమలత, తాసిల్దార్ రమేష్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పద్మనాభ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వినాయక ఘాటు వద్ద అధికారులతో సబ్ కలెక్టర్
Continue Reading

News

కుక్క దాడి 10 మందికి గాయాలు

Published

on

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెలగల్ గ్రామంలో పిచ్చికుక్క గ్రామస్తులపై దాడి చేయడంతో  10 మందికి గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరికీ మస్తాన్ సాబ్ (68), గౌతమ్ (8) కు తీవ్ర గాయాలు కావడంతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  మిగిలిన 8 మందిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బాధ్యులు తెలిపారు.

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మస్తాన్ షాప్
మస్తాన్ తెలిపిన వివరాలు
Continue Reading

Trending