Connect with us

News

చేనేత కార్మికులకు రూ.40 లక్షల రుణాల మెగా చెక్కు పంపిణీ

Published

on

కర్నూలు/ఎమ్మిగనూరు: చేనేత కార్మికుల సంక్షేమం, సంప్రదాయ నేత కళ పరిరక్షణ మరియు మార్కెటింగ్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి, ఎమ్మిగనూరు శాసనసభ్యులు బి.వి. జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మిగనూరులోని కుర్ని ఫంక్షన్ హాల్‌లో 12వ జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చేనేత ఉత్పత్తుల స్టాల్స్‌ను తిలకించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… 1905 స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. పర్యావరణహిత ఉత్పత్తులుగా ప్రపంచవ్యాప్తంగా చేనేత వస్త్రాలకు ఆదరణ పెరుగుతోందన్నారు.

సమావేశంలో హాజరైన జిల్లా కలెక్టర్

ప్రభుత్వ సంక్షేమ పథకాలు & ప్రణాళికలు: విద్యుత్ రాయితీ: 3,145 చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ యజమానులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్. ​పింఛన్ & రుణాలు: 2,707 మంది చేనేత కార్మికులకు నెలకు రూ.4,000 పింఛన్, పీఎం ముద్ర కింద 232 మందికి రూ.1.68 కోట్ల రుణాలు. ​మార్కెట్ అనుసంధానం: ప్రముఖ బ్రాండ్ “తనేరా” గడిచిన 6-7 నెలల్లో రూ.30 లక్షల విలువైన జిల్లా చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ​జిఐ ట్యాగ్ & టెక్స్‌టైల్ పార్క్: ఎమ్మిగనూరు వస్త్రాలకు భౌగోళిక గుర్తింపు (GI Tag) ప్రక్రియ కొనసాగుతోందని, బనవాసిలో టెక్స్‌టైల్ పార్క్ మరియు టిడ్కో కాలనీ సమీపంలో 80 సెంట్ల స్థలంలో ‘వీవర్స్ శాల’ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు.

చేనేత వస్త్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ సిరి

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… చేనేత కార్మికులను “చేనేత కళాకారులు”గా గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ​చేనేత కళాకారులకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం అని ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు.అగ్గిపెట్టెలో ఇమిడేంత సన్నని చీరలను నేసే ప్రతిభ ఎమ్మిగనూరు కళాకారుల సొంతమని కొనియాడారు. ఎమ్మిగనూరు ఖ్యాతిని పెంచడంలో పద్మశ్రీ మాచాని సోమప్ప చేసిన సేవలను స్మరించుకున్నారు. ​నేతన్న సేవలో: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25,000 ఆర్థిక సాయం. ఇంటిగ్రేటెడ్ హ్యాండ్‌లూమ్ టెక్స్‌టైల్ పార్క్: బనవాసిలోని 77 ఎకరాల ఎంఎస్‌ఎంఈ పార్కులో 22 ఎకరాలను ప్రత్యేకంగా టెక్స్‌టైల్ పార్క్ కోసం కేటాయింపు. ​ఆధునిక సాంకేతికత: తమిళనాడు, కర్ణాటక తరహాలో ఆధునిక మగ్గాలు, డిజైనింగ్ శిక్షణ, వీవర్స్ షెడ్ల ఏర్పాటు. మౌలిక సదుపాయాలు: ఎమ్మిగనూరు పట్టణంలో తాగునీటి పథకంతో పాటు ప్రతి ఇంటికి నాణ్యమైన నీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి. ​రూ.40 లక్షల రుణాల పంపిణీ: కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికుల స్వయం ఉపాధి, ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో రూ.40 లక్షల రుణాల మెగా చెక్కును కలెక్టర్ మరియు ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.

​ఈ కార్యక్రమంలో జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు, కుర్ని కార్పొరేషన్ చైర్మన్ మిన్నప్ప, చేనేత కళాకారుడు నరసప్ప, బిజెపి ఇన్చార్జ్ నరసింహులు, జనసేన ఇన్చార్జ్ రేఖ గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య, వివిధ శాఖల అధికారులు, మాస్టర్ వీవర్స్ మరియు చేనేత కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

News

భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.. జిల్లా కలెక్టర్

Published

on

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఒక్క నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ హాజరై ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించారు.

సమావేశంలో హాజరైన అధికారులు ప్రజలు

​కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు వస్తున్న వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ, సర్వే శాఖలకు సంబంధించినవే ఉన్నాయని తెలిపారు. వీటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సర్వే నిర్వహించే సమయంలో సరిహద్దు రైతులకు తప్పనిసరిగా నోటీసులు ఇచ్చి వారి సమక్షంలోనే ప్రక్రియ పూర్తి చేయాలని సర్వే శాఖ డిడి అరుణ్ కుమార్ కు స్పష్టం చేశారు.

సమావేశంలో హాజరైన అధికారులు

​ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నిర్ణీత కాలపరిమితిలో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 22-ఏ నిషేధిత జాబితా, రీ-సర్వే వివాదాలు, ఇనాం భూముల నమోదు, పట్టా భూముల వ్యత్యాసాలతో పాటు పింఛన్లు, తాగునీరు, విద్యుత్, గృహాల మంజూరుకు సంబంధించిన అర్జీలను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ హాజరై ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరిస్తున్న ఫోటో

​ఈ కార్యక్రమంలో ఆర్డీవో అరుణ దేవి, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, డిఆర్డిఏ పిడి శ్రీధర్, డిపిఓ భాస్కర్, ఐసిడిఎస్ పిడి విజయ, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సురేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ హాజరై ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరిస్తున్న ఫోటో
Continue Reading

News

ఆదోని నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం

Published

on

​ఆదోని నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదోని R&B గెస్ట్‌హౌస్‌లో దళిత ప్రజా సంఘాల నాయకులతో కలసి బాధితుడు, దానాపురం మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ విలేకరుల సమావేశం నిర్వహించారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

అవమానకర వ్యాఖ్యలు 2025 జూన్ 16న గ్రామంలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ప్రథమ పౌరుడైన తనను ‘ఎస్సీ’ అని కులం పేరుతో సంబోధించి, తీవ్రంగా అవమానించారని మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ వాపోయారు. ఏడాది కాలంగా రాష్ట్ర స్థాయి నుండి కేంద్ర స్థాయి అధికారుల వరకు ఫిర్యాదులు చేసినా, పోలీసులు మాత్రం కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిపై ఒక్కరోజులోనే కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు.. అధికార కూటమి నాయకులపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. దళితులను అవమానించిన కూటమి నాయకులకు పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని దళిత ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు.

Continue Reading

News

సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థి సంఘాల నిషేధం దుర్మార్గం: PDSU ఖండన

​సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాల నాయకుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) కర్నూలు జిల్లా అధ్యక్షుడు అఖండ డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సంక్షేమ నిధులను దోచుకోవడానికే ఈ కుట్రకు తెరలేపారని ఆయన ఆరోపించారు. సర్కులర్‌ను రద్దు చేయకపోతే ‘చలో సంక్షేమ భవన్’ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ​పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, మెస్, కాస్మోటిక్ చార్జీలు […]

Published

on

​సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాల నాయకుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) కర్నూలు జిల్లా అధ్యక్షుడు అఖండ డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సంక్షేమ నిధులను దోచుకోవడానికే ఈ కుట్రకు తెరలేపారని ఆయన ఆరోపించారు. సర్కులర్‌ను రద్దు చేయకపోతే ‘చలో సంక్షేమ భవన్’ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ​పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానిక ఆదోనిలోని ఎమ్మిగనూరు సర్కిల్ వద్ద PDSU ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. విద్యార్థులు కళ్లకు నల్ల గంతలు కట్టుకుని, మోకాళ్లపై కూర్చొని భిక్షాటన చేస్తూ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.

రోడ్డుపై నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘం నాయకులు

​ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షుడు అఖండ, డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ.​ ■ హామీలు విస్మరించిన కూటమి ప్రభుత్వం: అధికారంలోకి రాకముందు రూ.7,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామని, జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని మండిపడ్డారు. ■​సమస్యల నిలయాలుగా హాస్టళ్లు: విద్యార్థులకు సొంత భవనాలు నిర్మించాలని, నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచి నాణ్యమైన పోషకాహారం అందించాలని కోరారు. ■ ​పోరాటాలకు సిద్ధం: గతంలో పేద విద్యార్థులకు అన్యాయం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఏవిధంగా సాగనంపారో, హామీలు నెరవేర్చకపోతే కూటమి ప్రభుత్వానికి కూడా విద్యార్థులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ■ ​పోస్టుల భర్తీ: హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, కమాటి పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

రోడ్డుపై నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘం నాయకులు

​ఈ నిరసన కార్యక్రమంలో మండల నాయకులు రసూల్, బసవ, పవన్, విష్ణుముని, హుసేని, వంశీ, శశిధర్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు..

Continue Reading

Trending