News
ప్రజా పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.. CPM
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న NDA ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ధరలు పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్నదని, అలాగే దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నదని, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు విమర్శించారు.
కర్నూలు జిల్లా ఆదోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు వీరారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అయినప్పటికీ సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అమలు చేయాల్సిన రైతు భరోసా, తల్లికి వందనం, మహిళకు 1500, 50 ఏళ్లకే పెన్షన్, మహిళలకు ఫ్రీ బస్సు , పథకాలను ఇంతవరకు అమలు చేయకపోవడంతో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు ప్రజాపూరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల కార్యదర్శి వీరారెడ్డి తెలిపారు. 14వ తేదీన ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో NDA ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచమని చెప్పి, గతంలో ఇచ్చిన మాట తుంగలో తొక్కి, ట్రూ అప్ చార్జీల భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన, పత్తి ఉల్లి మిరప లాంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని తెలిపారు.
ఈ సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న కార్యదర్శి వర్గ సభ్యులు డి రామాంజనేయులు, మండల కమిటీ సభ్యులు J. రామాంజనేయులు, పి భాష, హనుమంత్ రెడ్డి, తిక్కప్ప తదితరులు పాల్గొన్నారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




