సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్

కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనకు కేరాఫ్ గా నిలిచాడని టిడిపి ఎ పి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి,గుంతకల్లు మైనారిటీ పరిశీలకుడు గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు.

టిడిపి ఎ పి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి,గుంతకల్లు మైనారిటీ పరిశీలకుడు గడ్డా ఫక్రుద్దీన్

కర్నూలు జిల్లా ఆదోనిలో బుదవారం గడ్డా ఫక్రుద్దీన్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ, ఇవ్వని హామీలను అమలు చేస్తూ ప్రజల చేత మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటింటా సుపరిపాలన పేరిట గడప గడప కు తిరిగి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. మంత్రి వర్గంలో  తీసుకున్న 9 అంశాలలో బ్రిటిష్ వారి నుండి స్వేచ్ఛ వాయువు పీల్చిన రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం అమలు,సత్ప్రవర్తన కలిగి ఉండడంతో 17 మంది జీవిత ఖైదీలకు విముక్తి, రాష్ట్ర వ్యాప్తంగా 2048 ఎస్పీఎఫ్ పోలీసు లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి, ఆటో డ్రైవర్ల తో సమావేశం ఏర్పాటు లాంటి సాహోసపేతమైన నిర్ణయాలు తీసుకున్న పరిపాలనాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version