Day: August 4, 2025

కర్రతో దాడి తలకు తీవ్ర గాయం

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామంలో ఉసేని అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉసేని తెలిపిన వివరాల మేరకు గ్రామంలో  ఘర్షణ పడుతున్నరని చూడడానికి వెళ్ళిన తనపై కర్రతో దాడి చేశారని  ఈ ఘర్షణకు తనకు ఎటువంటి సంబంధం లేకున్నా తనపై దాడి చేశారని తెలిపారు.

ఆర్ అండ్ బి రోడ్లు బాగు చేయండి.. సిపిఎం పార్టీ డిమాండ్

కర్నూలు జిల్లా ఆదోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సోమవారం మండల కమిటీ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి లింగన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2025 జనవరి  (సంక్రాంతి) నాటికి గుంతలు లేని రోడ్లు ఉంటాయని చెప్పినట్లు  గుర్తుచేశారు . కానీ  ఆగస్టు నెల వచ్చిన ఒక్క గుంతను కూడా పూడ్చలేదని కావున ప్రభుత్వం తక్షణమే ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ గుంతలు పూడ్చాలని కోరారు.ఆదోని తిమ్మారెడ్డి బస్టాండ్ నుండి సిరుగుప్ప క్రాస్ వరకు మరియు […]

ఆటో డ్రైవర్స్ లకు అవగాహన

కర్నూలు జిల్లా ఆదోని ఆర్టీసీ బస్సు స్టాండ్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు “రోడ్డు భద్రత – ప్రమాదాల నివారణ”  పై ఆటో డ్రైవర్స్ లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు    ఆదోని డి.ఎస్.పి మేడం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లు ఆటో నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి, ఇన్సూరెన్స్, పొల్యూషన్, మరియు యూనిఫామ్ కలిగి ఉండాలని […]

వికలాంగుల పెన్షన్ దారుల ఆవేదన

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో వికలాంగుల పెన్షన్లు హోల్డ్‌లో పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైసీపీ దివ్యాంగుల మండలాధ్యక్షుడు హనుమంత రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట విలేకరులతో మాట్లాడారు. వెరిఫికేషన్‌కు ముందు మెమోలు ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు. కొంతమంది దివ్యాంగుల పెన్షన్ దారులకు ముందుగానే మెమోలు ఇచ్చినప్పటికీ, మరికొన్ని గ్రామాల్లో వెరిఫికేషన్ రోజే మెమోలు ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని, పలువురు హాజరు కాలేకపోయారని తెలిపారు. ఇదే విషయంపై సోమవారం […]

విద్యార్థుల హక్కులను హరించేటువంటి జీవోను రద్దు చేయండి డి.ఎస్.ఎఫ్

విద్యార్థుల హక్కులను హరించేటువంటి జీవోను తక్షణమే రద్దు చేయాలని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అంబేద్కర్ సర్కిల్ వద్ద డి.ఎస్.ఎఫ్ విద్యార్థులు సంఘం నాయకులు నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ వినోద్ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించిన విద్యాశాఖ అధికారుల ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజాస్వామ్య విరుద్ధం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 04-08-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 8259/- రూపాయలు కనిష్ట ధర ₹. 6300/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 7020/- రూపాయలు కనిష్ట ధర ₹. 3551/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5322/- రూపాయలు కనిష్ట ధర ₹ 5322/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట […]

Gold, Silver Price బంగారు ధర

Date : 04 08 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 100200-001 గ్రాములు సుమారు రూ. 10020-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 92180-001 గ్రాములు సుమారు రూ. 9218-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 1132-00

ఆటో అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామ సమీపంలో సోమవారం వాల్మీకి విగ్రహం వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో నలుగురికి గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు. గాయాలైన ప్రయాణికులు తెలిపిన వివరాల మేరకు జోహరాపురం గ్రామం నుంచి ఆదోనికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 04-08-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 24130 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 23669 క్యూసెక్కులు

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 04 08 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 34/- రూపాయలు, రిటైల్: 1kg 36/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు

Back To Top
Exit mobile version