కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నెట్‌వర్క్ టవర్‌ను వెంటనే తొలగించాలి DSF, PDSO, RPSF విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ RPSF జిల్లా అధ్యక్షుడు బాలు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి హానికరం అంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు.
కాలేజ్ మైదానంలో టవర్ ఉండటం వల్ల విద్యా వాతావరణం ప్రభావితం అవుతోందని వారు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ చొరవ చూపి వెంటనే స్పందించి తక్షణమే టవర్‌ను తొలగించాలని కోరారు. టవర్ ను తొలగించ లేకపోతే విద్యార్థులు అందరినీ సమీకరించి రానున్న రోజుల్లో బందుకు పిలుపునిస్తామని విద్యార్థి సంఘాలుగా ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు షకీల్ వినీల్ రాజ్ కుమార్ నవీన్ వినోద్ మురళి తదితరులు పాల్గొనడం జరిగింది