News
నాటు సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం సాయంత్రం 5 గంటలకు ఆదోని పట్టణం అమరావతి నగర్ సమీపంలో వాహన తనిఖీ చేస్తుండగా పత్తికొండ మండలం JM తాండా గ్రామంనికి చెందిన నేనావత్ లోకేష్ అనే వ్యక్తి AP 21 AW 7943 (Bajaj Discover) స్కూటర్లో 20 లీటర్ల నాటు సారాయి తరలిస్తుండగా వన్ టౌన్ సిఐ విక్రమ సింహ పట్టుకున్నారు అతని అరెస్టు చేసి 20 లీటర్ల నటసార స్కూటర్ని స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించినట్లు సిఐ విక్రమ సింహ తెలిపారు.
వాహన తనిఖీలో 1 టౌన్ CI విక్రమసింహ
సిబ్బంది హాజీ భాషా , రంగస్వామి, సుధీర్, మునస్వామి పాల్గొన్నారు.
News
తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు
హోస్పేట: 13.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 13 (గురువారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1628.20 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 87.454 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 26834 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 23290 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 2266 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 87.852 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
News
ఎమ్మెల్యే విరూపాక్షి బెయిల్ పిటిషన్ పై రేపు ఆదోని కోర్టు లో విచారణ
ఆదోని, ఆగస్టు 12: ఆలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు విరూపాక్షి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై రేపు (ఆగస్టు 13, గురువారం) కోర్టులో విచారణ జరగనుంది. నేమకల్లు గ్రామానికి చెందిన ఒక ఎస్సీ మహిళపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్యే విరూపాక్షి మరియు ఆయన సోదరుడిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో న్యాయపరమైన ఉపశమనం కోసం వారు ఆదోనిలోని 2వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి కోర్టును ఆశ్రయించారు.
ఉభయ పక్షాల వాదనలు విన్న అనంతరం బెయిల్ మంజూరుపై న్యాయమూర్తి తమ నిర్ణయాన్ని వెల్లడించనుండటంతో రేపటి విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
News
వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు దేవాకు టూ టౌన్ పోలీసులు నోటీసులు జారీ
కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు బోయ దేవాకు టూ టౌన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 11న నమోదైన FIR No.152/2026 కేసు దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. BNS సెక్షన్లు 126(2), 189(2), 292 r/w 190 కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం రెండు రోజుల్లోగా తమ ఎదుట హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. హాజరయ్యే సమయంలో గుర్తింపు, నివాస ధృవీకరణ పత్రాలతో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు, పత్రాలను సమర్పించాలని సూచించారు.
నోటీసులోని ముఖ్య అంశాలు: ◆ విచారణకు సహకారం: కేసు దర్యాప్తులో భాగంగా దేవాను ప్రశ్నించాల్సి ఉన్నందున విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలి. ◆ ఆధారాల సమర్పణ: కేసుకు సంబంధించిన పత్రాలు, ఇతర వివరాలను పోలీసులకు అందజేయాలి. ◆ షరతులు: భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని, సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా సంబంధిత వ్యక్తులను బెదిరించడం, ప్రలోభపెట్టడం వంటివి చేయరాదని పోలీసులు స్పష్టం చేశారు. ◆ కోర్టు ఆదేశాలు: అవసరమైన సమయంలో కోర్టుకు మరియు చట్ట ప్రకారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేశారు.
వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు బోయ దేవాకు పోలీసు నోటీసులు జారీ కావడం ఆదోని స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
-
News3 weeks ago
ఆదోనిలో నిధి కోసం క్షుద్రపూజలు
-
News4 weeks ago
BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు
-
News3 weeks ago
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల విజయం..
-
News3 weeks ago
ఆదోనిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ
-
News4 weeks ago
ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు
-
News4 weeks ago
జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన
-
News6 days ago
ఆదోని నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం
-
News3 weeks ago
ఆదోని డివిజన్ APRSA అధ్యక్షుడిగా రజినీకాంత్ రెడ్డి