కర్నూలు జిల్లా ఆదోని పట్టణం శంకర్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ హుస్సేన్ కూతురు షామిన నీట్ పరీక్షలో 543 మర్కులు సాధించి కడప మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ సీటు సాధించినందుకు దూదేకుల సంఘం నాయకులు షామినాకు శాలువా కప్పి సన్మానించారు చదువుల ఖర్చుల కై 54 వేల 500వందల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దూదేకుల బీసీ ముస్లిం సంక్షేమ సంఘం నూర్ భాషా, దూదేకుల సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారులు పి.సాయి బాబా మాట్లాడుతూ తండ్రి హుస్సేన్ ఆటో నడుపుతూ తల్లి హజిర పొలం పనులకు పోతూ పిల్లలని ఇంత బాగా చదివించడం చాలా గర్వకారణం అని అన్నారు. ఈ విషయం తెలిపిన 99 టీవీ ఆదోని రిపోర్టర్ కాసింకు కృతజ్ఞతలు తెలిపారు.
షమీన తల్లితండ్రులు దూదేకుల సంఘం పెద్దలకు మేము రుణపడి ఉంటాంమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు ఇమామ్ ఖాసిం, మెహబూబ్ బాష, శైక్షవలి, సిద్దయ్య, మల్కన్న, మాబు, శాలి, టిప్పుసుల్తాన్ పాల్గొన్నారు.