కర్నూలు జిల్లా ఆదోని ఆర్టీసీ బస్సు స్టాండ్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు “రోడ్డు భద్రత – ప్రమాదాల నివారణ” పై ఆటో డ్రైవర్స్ లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఆదోని డి.ఎస్.పి మేడం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లు ఆటో నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి, ఇన్సూరెన్స్, పొల్యూషన్, మరియు యూనిఫామ్ కలిగి ఉండాలని సీఐ ఘంటా సుబ్బారావు అన్నారు. ఆటో లో రికార్డ్స్ మరియు పాటించవలసిన నియమ నిబంధనలు, ఇటీవల కొత్తగా పెరిగిన జరిమానాల గురించి వివరించినట్లు తెలిపారు.