కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో వికలాంగుల పెన్షన్లు హోల్డ్‌లో పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైసీపీ దివ్యాంగుల మండలాధ్యక్షుడు హనుమంత రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట విలేకరులతో మాట్లాడారు. వెరిఫికేషన్‌కు ముందు మెమోలు ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు. కొంతమంది దివ్యాంగుల పెన్షన్ దారులకు ముందుగానే మెమోలు ఇచ్చినప్పటికీ, మరికొన్ని గ్రామాల్లో వెరిఫికేషన్ రోజే మెమోలు ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని, పలువురు హాజరు కాలేకపోయారని తెలిపారు. ఇదే విషయంపై సోమవారం ఇన్చార్జి ఎంపీడీవో జనార్ధన్‌కు వివరించగా, సమస్య త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.