కర్నూలు జిల్లా ఆదోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సోమవారం మండల కమిటీ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి లింగన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2025 జనవరి (సంక్రాంతి) నాటికి గుంతలు లేని రోడ్లు ఉంటాయని చెప్పినట్లు గుర్తుచేశారు . కానీ ఆగస్టు నెల వచ్చిన ఒక్క గుంతను కూడా పూడ్చలేదని కావున ప్రభుత్వం తక్షణమే ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ గుంతలు పూడ్చాలని కోరారు.
ఆదోని తిమ్మారెడ్డి బస్టాండ్ నుండి సిరుగుప్ప క్రాస్ వరకు మరియు బైచిగేరి క్రాస్ నుండి కపటి గ్రామం వరకు, ధనాపురం నుండి నాగనాతనహాళ్ళి వరకు వయా హోళగుంద వరకు రోడ్లు పూర్తి గుంతల మయమై వాహనాలు ప్రయాణికులు తిరగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే రోడ్లను బాగు చేయాలని సిపిఎం పార్టీ మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదోని మండలం పాండవగల్ దగ్గర నుండి కుప్పగల్ క్రాస్ వరకు రోడ్డుకు ఇరువైపులా మట్టి అడుగు నుండి రెండు అడుగుల వరకు కోతకు గురై వాహనాలు సైడ్ కు తీసుకోలేని పరిస్థితి ఉందని, ప్రస్తుతం శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాసం ఉత్సవాలు సందర్భంగా తీవ్రమైన రద్దీ పెరిగిందని దీనివలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. తక్షణమే రోడ్డుకి ఇరువైపులా గర్ల్స్ వేసి ప్రమాదాల బారి నుండి కాపాడాలని కోరారు. సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, ఎం. ఉచ్చిరప్ప, జే రామాంజనేయులు, మండల కమిటీ సభ్యులు భాష, అయ్యప్ప, పాండురంగ, హనుమంత్ రెడ్డి, మునిస్వామి అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.