Connect with us

News

శ్రీశైలం డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు

Published

on

శ్రీశైలం డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు
జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
ఇన్ ఫ్లో 4,54,710 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 5,26,501క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 883.80 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 204.7888 టీఎంసీలు
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Continue Reading
1 Comment

1 Comment

  1. Sudha

    03/08/2024 at 3:09 pm

    Full satisfaction iam a farmer’s

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

పెండ్లి చేయడం లేదని తండ్రి పై కొడుకులు దాడి

Published

on

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం లో కన్న తండ్రి అని కనకరం లేకుండా కొడుకులు చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. మంత రాజు(60) వృద్ధుడిని తన సొంత కొడుకులే కన్న తండ్రిని దయ దక్షిణం లేకుండా ఇద్దరు కొడుకులు  రక్తం గాయాలయ్యాల చితకబాధరు.

మంతరాజు తండ్రి

స్థానికుల తెలిపిన వివరాల మేరకు.. ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు నీలకంఠ, చిన్న కొడుకు రాజేష్ వివాహం చేయడం లేదని  ఇద్దరు కుమారులు కలిసి తండ్రి పై దాడి చేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. రెండు కాళ్లు విరిగి రక్త గాయాలు కావడంతో అది గమనించిన స్థానికులు హుటాహుటిన గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మంతరాజుకు ప్రాథమిక చికిత్స అందిస్తున్న డాక్టర్లు
Continue Reading

News

13 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీరామ్ అంతరాష్ట్ర దొంగలముఠాను అరెస్టు చేసి కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ముందు హాజరు పరిచారు. 13 మందిని అరెస్టు చేసి వీరి వద్ద నుండి భారీగా ప్రాపర్టీని రికవరీ చేశారు. ఈ ముఠా నుంచి 21 కేసులలో దొంగలించబడిన 478.7 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ. 33 లక్షల 7 వేల 8 వందల విలువ)  రూ. 8 లక్షల 4 వేల నగదు మొత్తము సుమారు రూ.41 లక్షల, 11 వేల, 8 వందల ప్రాపర్టీ  స్వాధీనం చేసుకున్నరు.

దొంగల ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు

ప్రాపర్టీ రికవరీలో ప్రతిభ కనబరచిన ఆదోని ఒకటవ పట్టణ సిఐ శ్రీరామ్, ఎస్సై రామస్వామి , పోలీసుసిబ్బందిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ అభినందించి, రివార్డులు అందజేశారు.

దొంగల ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న నగదు
జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వాధీనం చేసుకున్న నగదును వివరిస్తున్న డి.ఎస్.పి సీఐ
మీడియా ముందు నగదును ప్రదర్శించిన ఎస్పీ
పోలీసులకు రివార్డులు అందజేస్తున్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్
Continue Reading

News

ఏసీబీ వలలో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్

Published

on

లక్షా 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్.. కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్.
ఒంగోలు ఎసిబి డిఎస్పి రామచంద్రరావు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి. సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీకి నోటీసు ఫెనాల్టీ వేసి ఆ పెనాల్టీ లేకుండా చేసేందుకు ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్ లక్షా యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీ యజమానులు ఏసీబీని ఆశ్రయించారు. అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ లంచం  తీసుకుంటుండగా ఒంగోలు ఏసిబి డిఎస్పి పి. రామచంద్రరావు తన సిబ్బందితో కలిసి దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్ శేషు, ఎస్ఐ లు జే.బీ.ఎన్ ప్రసాద్, షేక్. మస్తాన్ షరీఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

Trending