స్కూల్ బస్సులు తనిఖీలు నిర్వహించిన అధికారులు

కర్నూలు జిల్లా ఆదోని లో మంగళవారం పోలీసులు మరియు ఆర్టీవో అధికారులు సంయుక్తంగా ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ నిర్వహించారు. స్కూల్ బస్సులను, వాటికి సంబంధించిన రికార్డ్స్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్పి హేమలత మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యానికి మరియు డ్రైవర్లకు తగు సూచనలు చేశారు. డ్రైవర్లు   యూనిఫామ్ కలిగి ఉండాలని పిల్లల పట్ల మర్యాదగా ఉంటూ, డోర్ స్టెప్స్ దగ్గర పిల్లలు నిలబడకుండా మరియు  కిటికీ లోంచి తలలు బయటికి  పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని  సూచించారు. పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇతనిఖిలలో ఆదోని డిఎస్పి హేమలత, ఆదోని  మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శశిర దీప్తి, ట్రాఫిక్ సిఐ గంట సుబ్బారావు వారి సిబ్బంది పాల్గొన్నారు.

యూట్యూబ్ వీడియో
బస్సు పేపర్లు తనిఖీ చేస్తున్న అధికారులు
డ్రైవర్లు మరియు స్కూల్ యజమానులతో మాట్లాడుతున్న డిఎస్పి హేమలత
తనిఖీలు చేస్తున్న అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top