News
నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న బాలికల హాస్టల్ విద్యార్థినిలు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో బాలికల హాస్టల్ లో విద్యార్థినీలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ బయటి నుంచి నీళ్లు తెచ్చుకునె పరిస్థితి ఏర్పడిందని డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం ఎమ్మిగనూరు సర్కిల్లో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా డి.ఎస్.ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్, నవీన్ మాట్లాడుతూ మొద్దు నిద్రలో ప్రభుత్వ విద్యా అధికారులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదోని పట్టణంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఉంది విద్యార్థులు బయటకు వెళ్లి నీళ్లు తెచ్చేటప్పుడు రోడ్డు దాటే సమయంలో విద్యార్థులు కు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు! స్థానిక వార్డెన్ బాధ్యత వహిస్తారా? బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బాధ్యత వహిస్తారా? లేదా ప్రభుత్వ విద్యా అధికారులు బాధ్యత వహిస్తార అని ప్రశ్నించారు. కరువు ప్రాంతం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వలసలకు వెళ్తూ తమ పిల్లలు చదువులు పాడవకుండా హాస్టల్ లో ఉంటే బాగా చదువుకోని ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కంటున్నారు అయితే ప్రభుత్వ అధికారులు వారి కళలును నిజం చేసే విధంగా పనిచేయకుండా విద్యార్థులతో బయట నుంచి నీళ్లు మోయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులకు ప్రధాన నీటి సమస్యలు పరిష్కారం చూపాలని సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళన కార్యక్రమలు చేపడుతామని హెచ్చరించారు. విద్యార్థులకు హాస్టల్స్ లో సరైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసి తగిన న్యాయం చేయాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ DSF విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.ఎఫ్ నాయకులు వరుణ్, విక్రమ్, కిరణ్, వినీల్, రాజ్ కుమార్, చరణ్, సుకుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.
News
మత్తులో వాహనాలు నడిపితే శిక్షలు తప్పవు
మద్యం మత్తులో వాహనాలు నడిపితే తీవ్రమైన శిక్షలు తప్పవని మరోసారి రుజువు అయ్యింది.

కర్నూలు జిల్లా ఆదోని మండలంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు లో పట్టుబడిన 15 మందిని పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వారిలో ట్రాఫిక్ పోలీసులు నలుగురిని, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మందిని అదుపులోకి తీసుకుని కోర్టు లో హాజరు పరుచగా విచారణ అనంతరం న్యాయమూర్తి 4 గురికి ఒక వారం రోజులు, 5 గురికి 30 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదోని సబ్ జైలుకు తరలించరు. 6గురికి 10 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించరు. రోడ్డుపై ప్రయాణించే వాహన చోదకులు ముఖ్యంగా ద్విచక్ర వాహనాలతో పాటు, అన్ని రకాల వాహనాలను నడిపే వాహన డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలను రోడ్డుపై నడపవద్దని, ఇది చాలా ప్రమాదకరమని ఇకపై ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో పట్టుపడితే ఇదే విధమైన జైలు శిక్ష తప్పదని ఆదోని పోలీసులు హెచ్చరించరు.

News
ఆదోనిలో రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి
కర్నూలు జిల్లా ఆదోనిలో ఆస్పరి బైపాస్ రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని AP 04 V 1430 నంబర్‌గల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
ఆదోని పాత బ్రిడ్జిపై నుంచి పడి వృద్ధురాలికి తీవ్రగాయాలు
కర్నూలు జిల్లా ఆదోని పాత ఓవర్ బ్రిడ్జి పై నుండి కింద పడి శాంతమ్మ (70) అనే వృద్ధురాలికి తీవ్రగాయాలు అయ్యాయి. వృద్ధురాలి కుమారుడు మహానంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కల్లుబాయిలో నివాసం ఉంటున్నామని వారం రోజుల క్రితం మహానంది తల్లి శాంతమ్మ (70) ఆస్పరి లో ఉన్న తన కూతురు వద్దకు వెళ్లి ఈరోజు మధ్యాహ్నం తిరుగు ప్రయాణమై బ్రిడ్జిపై నుంచి నడుచుకుంటూ వస్తూ కళ్ళు తిరగడంతో కింద పడిందని మహానంది తెలిపారు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలు ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారని మహానంది మీడియాకు తెలిపారు.
