వజ్రాయుధం ఓటు హక్కు

ఓటు హక్కు తోటే బంగారు భవిష్యత్తు , సామాన్యుని చేతిలో వజ్రాయుధం ఓటు హక్కని ఆదోని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు.

జండా ర్యాలీని ప్రారంభించిన సబ్ కలెక్టర్
ర్యాలీకి సంబంధించిన యూట్యూబ్ వీడియో

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మాతా శిశు హాస్పిటల్ (ఎం సి హెచ్) నుండి ఎమ్మిగనూరు సర్కిల్ వరకు స్వీప్ ఓటు హక్కు అవగాహన పై ఆదోని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ శర్మ మున్సిపల్ అధికారులు, బి ఎల్ వో లు , అంగన్వాడి, సచివాలయ సిబ్బందితో కలిసి కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు.

ఎమ్మిగనూరు సర్కుల్లో మానవహారం

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గం లో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించు కోవాలన్నారు. ఓటర్ నమోదు శాతాన్ని పెంచుకోవాలసిన అవసరం ఉందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. ఓటర్లు బాధ్యతగా బయటకు వచ్చే ఓటు వేయాలనే విషయాన్ని ప్రజలందరికీ చేరవేయాలని సంబంధిత అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు.

ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్ అధికారులు, బి ఎల్ వో లు , అంగన్వాడి, సచివాలయ సిబ్బంది

కార్యక్రమంలో తాసిల్దార్ హసీనా సుల్తానా, మునిసిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి, మునిసిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, డి ఎల్ పి ఓ పరిపాలన అధికారి వీరభద్రప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment