ఆదోనిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

ఆదోని క్రైం, ఆగస్టు 30: పట్టణంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను ఆదోని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు… స్థానిక వీఎస్‌బీ (VSB) ఫంక్షన్ హాల్ పక్కనే ఉన్న చైతన్య ఇండస్ట్రీస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ సమీపంలోని ఖాళీ స్థలంలో కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. సీఐ ఆదేశాల మేరకు ఎస్‌ఐ ఆర్. విజయ్ కుమార్ నాయక్ తన సిబ్బందితో కలిసి ఆ ప్రదేశంపై ఆకస్మిక దాడి నిర్వహించారు.

ఈఐ ఫోటో

ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 10,300 నగదుతో పాటు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం. 78/2026, సెక్షన్ 9(1) ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. పట్టణంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

Back To Top