Author: Shamsheer khan

కర్ణాటక మద్యం తరలించే వారిపై ఉక్కు పాదం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం డంప్ యార్డ్ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 18 కర్ణాటక మద్యం బాక్సులు ఒక స్కూటర్ను సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెబ్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపిన వివరాల మేరకు శుక్రవారం ఉదయం ఆదోని పట్టణానికి చెందిన బోయ సూర్య, బోయ నీలకంఠ, దుబ్బ నరసింహులు ఒక మోటారు సైకిలు మీద 18 కర్ణాటక మద్యం బాక్సులు రవాణా చేస్తుండగా గుర్తించి […]

మృతి చెందిన వాలంటీర్ కుటుంబానికి అండగా మేమున్నాం

ఆదోని బావాజీపేట రెండో వార్డ్ లో 10వ తేదీ సచివాలయం వాలంటరీ మల్లేకర్ అరుణ మృతి చెందడంతో ఆ కుటుంబానికి ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ బీమా లక్ష రూపాయలు మరియు మట్టి ఖర్చులకు పదివేల రూపాయలు వారి కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ వార్డు కౌన్సిలర్ ఏవి సురేష్, వెల్ఫేర్ కృష్ణ అందజేశారు.

కరెంటు స్తంభం వైర్ తెగి మృతి చెందిన 72 గంటల్లో నష్టపరిహారం

కర్నూలు జిల్లా అదోని ఎల్.బి.స్ట్రీట్ లో14వ తేదీ సోమవారం కరెంట్ స్తంభం వైర్ తెగి అయ్యమ్మ అనే వృద్ధురాలు మృతి చెందినందుకు విద్యుత్ శాఖ వారు ఆ కుటుంబానికి నష్టపరిహారంగా ఐదు లక్షల చెక్కును ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా అందించారు.ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 72 గంటల్లో ఐదు లక్షల పరిహారం విద్యుత్ శాఖ అధికారులతో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి బాధితులకు అందించామని తెలిపారు.వృద్ధురాలు కూతుళ్లు మాట్లాడుతూ మా తల్లిగారు […]

ప్రతి ఒక్కరూ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి

కర్నూలు జిల్లా ఆదోని.. విద్యతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని అందువల్ల ప్రతి ఒక్కరు విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తమ పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయాలని ఆదోని స్పెషల్ సబ్ జైలు జైలర్ నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణంలోని దుల్షా పైల్వాన్ మసీదు కమిటీ ప్రధాన ముతవల్లి షేక్ జక్రియ ఆధ్వర్యంలో దుల్షా పైల్వాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన […]

మార్కెట్ యార్డల్లో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో 77వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ మజహార్ అహ్మద్ జాతీయ జెండాను ఎగురవేసి ఫ్లాగ్ సెల్యూట్ చేశారు. అనంతరం మార్కెట్ యార్డ్ చైర్మన్ మజహార్ అహ్మద్ మరియు వైస్ చైర్మన్ తిమ్మప్ప మాట్లాడుతూ రైతులకు మార్కెట్ యార్డ్ ఉద్యోగులకు నాయకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అక్షర శ్రీ స్కూల్లో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

కర్నూలు జిల్లా ఆదోని అక్షర శ్రీ స్కూల్లో 77వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు భారతదేశ ఖ్యాతిని మరియు గొప్పదనాన్ని చాటి చెప్పే విధంగా విద్యార్థినీ విద్యార్థులు దేశ స్వాతంత్ర సమరయోధులుగా మరియు నాయకులుగా వేషాధారణతో అందరినీ ఆకర్షించారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని చాటుతూ విద్యార్థులు అలరించారు. ఫ్లాగ్ సెల్యూట్ మరియు మార్చ్ ఫాస్ట్ ద్వారా విద్యార్థిని విద్యార్థులు దేశ స్వాతంత్ర వీరులను కొనియాడుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎం. మేఘనాథ్ […]

వైఎస్ఆర్సిపి కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు

ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగం తో గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆయన ఆశయాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యాన్ని పేదలకు అందిస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో 77 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జాతీయ జెండాను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎగరవేశారు. అనంతరం ఎస్ఈఆర్పి(SERP) వైఎస్ఆర్ క్రాంతి పథకంలో ఉద్యోగస్తులకు […]

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రైల్వే శాఖకు 2 వీల్ చైర్స్

కర్నూలు జిల్లా ఆదోనిలో 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఆదోని ఆధ్వర్యంలో ఆదోని రైల్వే స్టేషన్లో జాతీయ జెండా ఆవిష్కరించి రైల్వే శాఖకు రెండు వీల్ ఛైర్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ విట్ట శ్రావణి, సెక్రెటరీ మాలతి, ట్రెజరర్ రాయచోటి అభిరూప, ఐ ఎస్ ఓ లీన, మరియు సత్య, కోమల ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు, రైల్వే స్టాఫ్, పోలీస్ బృందం పాల్గొన్నారు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో వృద్ధురాలు మృతి..

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఎల్.బి స్ట్రీట్ లో అయ్యమ్మ అనే 74 సంవత్సరాల వృద్ధురాలు పై కరెంటు తీగ తెగిపోయి కిందపడి మృతి చెందింది. ప్రమాదకరంగా ఉన్నా విద్యుత్ తీగల పై కోతి కూర్చొని ఉపడంతో తెగి కింద వృద్ధురాలి పై పడిందని బాధితులు తెలిపారు. కంప్లైంట్ ఇచ్చిన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మా అమ్మ మృతి చెందిందని కూతురు ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసింది. కంప్లైంట్ ఇచ్చినప్పుడే విద్యుత్ అధికారులు స్పందించి […]

దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు జాబితాలో ఆదోని రూరల్ పి.ఎస్

కర్నూలు జిల్లా, అదోని..దేశంలో ప్రతి సంవత్సరం కేంద్ర హోంశాఖ అత్యుత్తమ పని తీరు కనబరిచిన పోలీస్ స్టేషన్లకు ఇచ్చే అవార్డులు జాబితాలో కర్నూలు జిల్లా ఆదోని రూరల్ పోలీస్ స్టేషన్ కు చోటు దక్కడంతో కేంద్ర హోంశాఖకు సంబంధించిన అగ్రి రూరల్ కన్సల్టెన్సీ అధికారి లోకేష్ రెడ్డి ఆదివారం ఆదోని రూరల్ పోలీస్ స్టేషన్ ను పరిశీలించినారు. లోకేష్ రెడ్డి మాట్లాడుతూ 2023 వ సంవత్సరానికి సంబంధించి ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డులకు దేశవ్యాప్తంగా 10 స్టేషన్ […]

Back To Top