News
నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
ఆదోని రూరల్, ఫిబ్రవరి 18:
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.
ఘటన వివరాలు:
పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గుట్టల వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటు సారా బట్టిని పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.
భారీగా ఊట ధ్వంసం:
పోలీసులు సారా బట్టి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన ఊటను తక్షణమే ధ్వంసం చేశారు. అలాగే, ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
నిందితుడి గుర్తింపు:
పోలీసుల ప్రాథమిక విచారణలో, సారా బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు కుమారుడు బోయ శివగా తేలింది. స్థానిక పొలాల యజమానుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్యా శ్రీ తెలిపారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

News
వృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్
ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగులకు బానిసై దొంగతనానికి పథకం వేసిన యువకుడు.. కరీంనగర్‌లోని ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఆన్‌లైన్ బెట్టింగులకు బానిసై దాదాపు రూ.4 లక్షలు నష్టపోయిన జగిత్యాల జిల్లా గుల్లపేట గ్రామానికి చెందిన దమ్మ దినేష్ రెడ్డి(21) అనే యువకుడు..
లోన్ యాప్ ద్వారా తీసుకున్న రుణం చెల్లించమని నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో దొంగతనానికి పథకం వేసిన నిందితుడు. ఈ నెల 1వ తేదీన లేబర్ అడ్డా వద్ద కూలి పని కోసం నిలబడ్డ గంగాధర లక్ష్మీ అనే వృద్ధురాలి దగ్గరికి వెళ్లి, పని ఇప్పిస్తానని చెప్పి, నసుల్తాపూర్ శివారులోని తీసుకెళ్లి అర తులం బంగారం, 20 గ్రాముల వెండి కాజేసి వృద్ధురాలిని బావిలో తోసేసి వెళ్ళిపోయిన దినేష్ రెడ్డి..
దాదాపు 21 గంటలు బావిలో ఉన్న అనంతరం, మరుసటి రోజు ఉదయం లక్ష్మిని గ్రామస్థులు బావి నుండి బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చిరు. సీసీటీవీ ఫుటేజ్, ర్యాపిడో బుక్ చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా కరీంనగర్ అమరవీరుల స్తూపం వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. నిందితుడిని దినేష్ రెడ్డిని విచారించగా బంగారాన్ని టవర్ సర్కిల్ వద్ద వేణు మనోహరాచారి అనే వ్యాపారికి విక్రయించి రూ.30 వేలు తీసుకున్న నిందితుడు తెలిపాడు. నిందితుడితో పాటు బంగారం వ్యాపారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

News
అదోనిలో 30 లక్షలు విలువ చేసే 35 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోనిలో టూ టౌన్ పోలీసులు సుమారు 30 లక్షలు విలువ చేసే 35 టు వీలర్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సిఐ తెలిపిన వివరాల మేరకు వాహనాలు తనిఖీలు చేస్తుండగా మంత్రాలయం నియోజకవర్గం చిన్న తుంబలం గ్రామానికి చెందిన వడ్డే మహేష్ అనే వ్యక్తి ని అనుమానంతో అపి విచారించగా తాను చోరీ చేసుకుని వెళ్తున్న వాహనమని గుర్తించి అతన్ని విచారించగా వడ్డే మహేష్ నుంచి నుంచి చోరీ అయిన సుమారు 30 లక్షల విలువచేసే 35 బైక్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వడ్డే మహేష్ కుమార్ ని అరెస్టు చేసి రిమైండ్ కి తరలించిన టూటౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.



News
అదోనిలో 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీసుల వాహన తనిఖీల్లో అక్రమంగా ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు అక్రమంగా తరలిస్తున్న షేక్ షాకీర్ , అక్షయ్ జాదవ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. వెండి బిస్కెట్లకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో వెండిని ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పజెప్తామని సిఐ తెలిపారు.


