ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 7 వరకు సమరభేరి

◆ దేశంలో సామాన్య ప్రజలు కొనలేని స్థితిలో నిత్యవసర వస్తువుల ధరలు..
◆ 4 నుండి 8 శాతానికి పెరిగిన నిరుద్యోగ సమస్య..
◆ 5 రకాల పన్నుల పేరుతో రాష్ట్రంలో రెండింతలు పెరిగిన విద్యుత్ చార్జీలు..
◆ సమస్యల పరిష్కారం కోసం పోరాటం..
◆ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 7 వరకు సమరభేరి..

గ్రామాల్లో కరపత్రాలు అందజేస్తు సంతకాల సేకరణ చేస్తున్న మండల కార్యదర్శి కే లింగన్న

కర్నూలు జిల్లా ఆదోని మండలం మధిర గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల నుండి సంతకాలను సేకరణ చేయడం జరిగిందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న తెలిపారు.
ఆగస్టు 30, 31 తేదీల్లో గ్రామాల్లో సంతకాల సేకరణ, సెప్టెంబర్ 1, 2 తేదీలలో గ్రామ సచివాలయాల ముందు ఆందోళన, సెప్టెంబర్ 5వ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాల్లోన పెద్ద సంఖ్యలో ప్రజలు భాగస్వాములు కావాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు చిన్న తిక్కన్న, శాఖ కార్యదర్శి శ్రీనివాసులు, పార్టీ సభ్యులు ఈరన్న, కుమారప్ప, జలంధర్ నడిపి మూకన్న, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version