News
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
ప్రేమించిన యువతికి వేరొకరితో పెళ్లి అయ్యిందన్న మనస్తాపంతో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదోని – కుప్పగల్లు రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది.
రైల్వే హెడ్ కానిస్టేబుల్ సి. శివరామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆదోని మండలం గనేకల్ గ్రామానికి చెందిన పాండవగల్లు శివరాజ్ (20) బుధవారం (జూలై 29) రాత్రి ఇసవి-కుప్పగల్లు రైల్వే స్టేషన్ల మధ్య కేఎమ్ నెంబర్ 504/23-21 వద్ద అప్‌లైన్ రైల్వే ట్రాక్‌పై రైలు కింద పడి మృతి చెందాడు. బిటిపిటి గూడ్స్ రైలు లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతుడి తండ్రి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, అప్పటి నుంచి శివరాజ్ జులాయిగా తిరుగుతూ తాగుడుకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తన అక్క కూతురిని ఇష్టపడగా, అతని ప్రవర్తన నచ్చని అక్క తన కుమార్తెను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శివరాజ్ గుర్తుతెలియని రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
News
ఆదోని జిల్లా సాధన రిలే నిరాహార దీక్ష తాత్కాలిక విరామం
కర్నూలు జిల్లా అదోనిలో గత 269 రోజులుగా ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు తాత్కాలికంగా విరామం లభించింది. ఆదోని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కే. మీనాక్షి నాయుడు విజ్ఞప్తి మేరకు జేఏసీ నాయకులు దీక్షా శిబిరాన్ని విరమించి వేదికను తొలగించారు.
దీక్ష విరమణ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మాట్లాడుతూ — రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, సాంకేతిక అంశాల దృష్ట్యా తక్షణమే కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు ఆమోదం పొందిన వెంటనే, కొత్త నియోజకవర్గాలు మరియు జిల్లాల సంఖ్య పెరుగుతుందని ఆ సమయంలో ఆదోనిని జిల్లాగా ప్రకటించే అంశాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని లోకేష్ మరియు ఇన్‌చార్జ్ మంత్రి హామీ ఇచ్చారని మీనాక్షి నాయుడు వెల్లడించారు.
జేఏసీ ప్రతినిధులు వై.పి. నాగరాజ్, సుజ్ఞానమ్మ, దేవశెట్టి ప్రకాష్ తదితరులు మాట్లాడుతూ — గత 269 రోజులుగా పశ్చిమ కర్నూలు ప్రాంత ప్రజల కాంక్ష మేరకు సాగిన ఈ ఉద్యమానికి ఆదోనితో పాటు ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని జేఏసీ నాయకులు గుర్తుచేశారు. కుల, మత, రాజకీయ పార్టీల అతీతంగా వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, పత్రికా ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాలు ఈ దీక్షలకు పూర్తి మద్దతు తెలిపారుఅని ఇది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం కాదని 77 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పశ్చిమ ప్రాంత సమగ్ర అభివృద్ధి, మెరుగైన వైద్యం, తాగు/సాగు నీటి లభ్యత కోసమే ఈ పోరాటం ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా 269 రోజుల పాటు ఉద్యమానికి సహకరించిన ప్రజలకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా ప్రతినిధులకు జేఏసీ నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
News
DYFI ఆధ్వర్యంలో పాండవగల్లు బస్టాండ్ వద్ద రాస్తారోకో
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు గ్రామం నుండి ఎరిగేరి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం తక్షణమే ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని డివైఎఫ్ఐ (DYFI) డిమాండ్ చేస్తూ మంగళవారం పాండవగల్లు బస్టాండ్ ప్రధాన రహదారిపై విద్యార్థులు, నాయకులతో కలసి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు చిరంజీవి మాట్లాడుతూ… పాండవగల్లు గ్రామం నుండి ప్రతినిత్యం సుమారు 200 మందికి పైగా విద్యార్థులు ఎరిగేరి హైస్కూల్‌కు వెళ్లి వస్తుంటారని తెలిపారు. అయితే, ఈ రూట్లో వెళ్లే ఉరుకుంద, కౌతాళం తదితర బస్సులు గ్రామంలో ఆపకుండా వెళ్ళిపోతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుర్హున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రవాణా సౌకర్యం లేక చాలామంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. 13వ తేదీ నుండి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని, ఫలితంగా విద్యార్థులు మరీంత అవస్థలు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి పాండవగల్లు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ గ్రామ నాయకులు మోహన్ రెడ్డి, మంజు, భాష, వీరాంజి, పలు ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News
తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు
హోస్పేట: 11.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 11 (మంగళవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1626.82 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 82.599 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 41167 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 39569 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1630 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 86.894 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
-
News4 weeks ago
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News2 weeks ago
ఆదోనిలో నిధి కోసం క్షుద్రపూజలు
-
News4 weeks ago
BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు
-
News2 weeks ago
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల విజయం..
-
News3 weeks ago
ఆదోనిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ
-
News3 weeks ago
ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు
-
News3 weeks ago
జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన
-
News4 days ago
ఆదోని నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం