Day: June 26, 2023

ఆవకాయ హోటల్ యజమాని పై దాడి

కర్నూలు జిల్లా ఆదోనిలో దౌర్జన్యం…ఆవకాయ రెష్టరెంట్ యజమాని శ్రీనివాస్ పై దాడికి పలుపడిన కమ్మిరెడ్డి, విష్ణు రెడ్డి. ఆర్డర్ చేసిన ఫుడ్ డబ్బులు ఇచ్చి తీసుకోనిపో ఆన్నందుకు కమ్మిరెడ్డి, విష్ణురెడ్డి అనే వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కమ్మిరెడ్డి అనుచరులు దుర్భాషలాడుతూ కిచెన్ లోకి లాక్కెళ్లి దాడి చేశారు. కమ్మిరెడ్డి ఆర్ట్స్ & సైన్స్ కాలేజిలో ఫిజికల్ డైరెక్టర్, విష్ణు రెడ్డి కెడిసిసి బ్యాంకులో ఉద్యోగిగ పనిచేతున్నారు. యజమాని శ్రీనివాస్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మత్తుకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ

మత్తుకు దూరమవుదాం.. కుటుంబానికి దగ్గరవు దాం.. అనే నినాదంతో కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లో SEB మరియు 3 టౌన్ పోలీసుల అధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలనుపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పోలీస్ కంట్రోల్ రూం వరకు ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో ఆదోని […]

త్రాగునీటికై రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు

కర్నూలు జిల్లా ఆదోని మండలం బల్లెకల్ గ్రామంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొన్నప్పటికీ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు గాని అధికారులు కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వలన నేటికీ తాగునీటికి నోచుకోవడం లేదని చాలా వీధుల్లో సక్రమంగా నీళ్లు సరఫరా కావడం లేదని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం డివైఎఫ్ఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదోని మాధవరం రోడ్డు మీద అరగంటసేపు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ గత సంవత్సరం క్రితం సచివాలయాన్ని ముట్టడించినప్పటికీ అధికారులు సమస్య […]

Back To Top