కర్నూలు జిల్లా ఆదోని లో క్రికెట్ బెటింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు ఇస్మాయిల్ భాష, శివమూర్తి, పింజరి హుస్సేన్ అను నిర్వాహకులను త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 8 లక్షల 25 వేల 5 వందలు రూపాయల నగదు, 8 సెల్ ఫోన్ లు, 30 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు డి.ఎస్.పి శివ నారాయణస్వామి తెలిపారు.
డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు ఆదోని ఎమ్మిగనూరు బైపాస్ వద్ద ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారంతో దాడులు నిర్వహించి పట్టుకున్నామని తెలిపారు. వీరిని విచారించగా వైజాగ్ కి చెందిన రాఘవేంద్ర చారి హైదరాబాద్కు చెందిన నిసార్ అహ్మద్ వారి కింద ఈ ముగ్గురు పని చేస్తున్నారని ఆదోనిలో బెట్టింగ్ ఆడే వారి నుంచి కలెక్షన్ చేసి పంపిస్తే 5% కమిషన్ వారికి వస్తుందని తెలిపారు. త్వరలో రాఘవేంద్ర చారిని, నిసార్ అహ్మద్ ని పట్టుకుంటామని డిఎస్పి శివ నారాయణ స్వామి తెలిపారు. ప్రస్తుతానికి ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమైండ్ కి తరలించినట్లు తెలిపారు.