క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులపై పోలీసుల ఉక్కు పాదం

◆ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు 5 మంది అరెస్ట్..
◆ సుమారు 2 లక్షలు నగదు, ఐదు సెల్ ఫోన్లు, 25 లీటర్ల నాటు సారా స్వాధీనం..

కర్నూలు జిల్లా ఆదోనిలో 5 మంది క్రికెట్ బెట్టి నిర్వాహకులను వన్ టౌన్ సిఐ విక్రమసింహ అరెస్టు చేశారు. సిఐ విక్రమ సింహ తెలిపిన వివరాల మేరకు ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు డిఎస్పి శివ నారాయణ స్వామి పర్యవేక్షణలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎన్టీఆర్ నగర్ కు చెందిన గొల్ల వీరేష్ (36), బోయగిరికి చెందిన బోయ ఆంజనేయులు (37), రాజరాజేశ్వరి గుడి సమీపంలో ఉన్న పింజరి మహమ్మద్ ఖాసిం (37), గొల్ల వీధికి చెందిన గొల్ల విజయ్ కారం పేటకు చెందిన మిఠాయి వాలా ఉస్మాన్ ఐదు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 1లక్ష 98 వేల నగదు, 5 సెల్ ఫోన్లు మరియు 25 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 5 మంది పై ఏపీ గేమింగ్ యాక్ట్ 9(1), యాప్ యాక్ట్ 8(E) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో వన్ టౌన్ సిఐ విక్రమసింహ మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సత్తార్ వలి పోలీస్ కానిస్టేబుళ్లు రామచంద్ర, రంగస్వామి, సుధీర్ కుమార్, అశోక్ కుమార్, సుధాకర్, అల్లెన్న పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version