కర్నూలు జిల్లా అదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి వై జయమనోజ్ రెడ్డి 26 వార్డుకు సంబంధించిన మహిళలకు దాదాపు 30 కుటుంబాలకు tidco రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ పట్టాలు అందజేశారు. అనంతరం జయం మనోజ్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే 500 రూపాయలు tidco కు కట్టినారు వారందరికీ కూడా కేవలం ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళందరికీ కూడా టీ ట్కో డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. సొంత ఇల్లు ఉండాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే మాట కోసం కట్టుబడి ఉండే ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అని జయ మనోజ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఆదోని పట్టణ అధ్యక్షులు బి దేవా వార్డు ఇన్చార్జి మల్లికార్జున నెట్టకల్ రామంజి సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు