ప్రాచీన కట్టడాలను కాపాడుకుందాం

ప్రాచీన కట్టడాలను కాపాడుకుందాం అని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయలో ఆర్కియాలజీ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మరియు జామియా మసీద్ పెద్దలరో ప్రాచీన కట్టడాలపై సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 500 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రాచీన కట్టడాలైన మసీదును అందరం కలసి కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. మసీద్ పరిసరాల ప్రాంతాల్లో జరుగుతున్న కట్టడాలపై రెవెన్యూ అధికారులు, సర్వేర్, మునిసిపల్ అధికారులతో కలిసి ప్రాధమిక విచారణ చేపడతామని అన్నారు. విచారణ చేపట్టిన నివేదికను ఉన్నత అధికారులకు పంపిస్తామని తెలిపారు.


ఈ సమావేశంలో డిప్యూటీ తాసిల్దార్ రజనీకాంత్ రెడ్డి, మండల సర్వేయర్ రమణ, మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసులు షాహి జామియా మజీద్ పెద్దలు సౌదీ రావూఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న సబ్ కలెక్టర్
జామియా మజీద్ చుట్టుపక్కల కట్టడాలపై విచారణ చేస్తున్న సబ్ కలెక్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version