ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులుగా వెల్లాల మధుసూధనశర్మ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నూతన అధ్యక్షులుగా వెల్లాల మధుసూదన శర్మ ను బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. నెల్లూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు ఇందులో నూతన అధ్యక్షులుగా వెల్లాల మధుసూదన శర్మ, ప్రధానకార్యదర్శి పోతావజ్జుల పురుషోత్తమశర్మ(తెనాలి) , కోశాధికారిగా శ్రీ కౌతా సుబ్బారావు(విజయవాడ) ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా వెల్లాల మధుసూదన శర్మ మాట్లాడుతూ ఎన్నికకు సంహరించిన మాజీ అధ్యక్షులు శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి యనమండ్ర సాయీ సురేష్, కోశాధికారి శ్రీ పోతావజ్జుల పురుషోత్తమ శర్మ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సంఘం నాయకులకు తనపై నమ్మకముంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రములో ఉన్న బ్రాహ్మణ సమస్యల పరిష్కారానికి తనవంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మధుసూదన శర్మ తెలియచేసారు.
మధుసూధనశర్మ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు రాష్ట్రములోని వివిధ బ్రాహ్మణ సంఘాలు అభినందనలు తెలియచేసారు.

నూతన అధ్యక్షుడు మధుసూదన శర్మకు గజమాలతో సన్మానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version