ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్ గ్రేవ్ యార్డ్ ( సైకిల్ల స్మశాన వాటికలు)

■ చైనాలో ఒక్కొక్క డంపియాడ్ లో రెండు లక్షల సైకిళ్లు లెక్కలేనన్ని డంప్ యార్డ్ లు..
■ ఒక కోటి 60 లక్షల సైకిళ్లు రోడ్లపై తిరుగుతున్నాయి..
■ 2017లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో సైకిల్ బైక్ షేరింగ్ వ్యాపారం..
■ సైకిల్ స్మశాన వాటికలు..

చైనాలో కొన్ని సంవత్సరాల ముందు సైకిల్ బైక్ షేరింగ్ బాగా అభివృద్ధి చెందింది( బూమ్ నడిచింది).
ఒకచోట సైకిల్ని బాడుగకు (రెంట్ కు) తీసుకొని తాను వెళ్లాల్సిన చోటికి వెళ్లి గమ్యస్థానంలో వదిలి వెళ్ళిపోతారు. అక్కడ నుండి వేరే వాళ్ళు రెంటుకు తీసుకొని పోయేదాన్ని సైకిల్ బైక్ షేరింగ్ అంటారు. ఈ సదుపాయం మిడిల్ క్లాస్ వారికి ప్రయాణించడానికి చాలా బాగుండేది అతి తక్కువ ధరకు ప్రయాణం అనుకూలం కావడంతో ఎంతో మంది సదుపాయాన్ని వినియోగించుకున్నారు.

చైనాలో అత్యంత ప్రసిద్ధ డాక్‌లెస్ బైక్-షేరింగ్ వ్యాపారం క్యాంపస్ స్టార్టప్‌గా ప్రారంభమైంది. 2015లో నలుగురు పెకింగ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్లు క్యాంపస్‌లో “ofo” అనే డాక్‌లెస్ షేర్డ్ బైక్‌లను ప్రారంభించారు. 2016లో నగరాల్లో, పట్టణా లో బైక్-షేరింగ్ సేవలను విస్తరించారు. 2016లో మరొక ప్రధాన బైక్-షేరింగ్ కంపెనీ Mobike తన వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇంటర్నెట్ ద్వారా మొబైల్ యాక్టివేషన్ వచ్చిన తర్వాత దగ్గరలోని సైకిల్ల లొకేషన్ ను తెలుసుకునేవారు. ప్రజలకు ఈ సదుపాయం బాగా నచ్చింది దానివల్ల చాలా ఈజీ అయిపోయింది. కానీ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు సైకిళ్లు అందుబాటులో ఉండేవి కావు అప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. ఇది గమనించిన పెద్ద పెద్ద కంపెనీలు మార్కెట్ డిమాండ్ ను చూసి బిలియన్ డాలర్లతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చి వ్యాపారాలు మొదలుపెట్టాయి 2017 నాటికి, దాదాపు 70 బైక్-షేరింగ్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్క పట్టణంలో కొన్ని వేల నుంచి లక్షల సైకిళ్లు లను రోడ్లపై నిలబెట్టారు. దీంతో ప్రపంచంలోనే ఈ వ్యాపారము మొదటి స్థానంలో నిలబడింది.

ఒక సర్వే ప్రకారం 1 కోటి 60 లక్షల సైకిళ్లు రోడ్లపై తిరిగేవి. చైనాలో బైక్-షేరింగ్ పరిశ్రమ 2017 నుండి (బూమ్ వచ్చింది) బైక్-షేరింగ్ మార్కెట్లో వేగవంతంగా విస్తరించింది. 1 కోటి 20 లక్షల సైకిళ్లు అవసరం ఉన్న చోట కంపెనీలు 2 కోట్ల 30 లక్షల సైకిళ్లు నిలబెట్టారు అవసరానికి మించి రెండింతల సైకిల్ లు ఎక్కువైపోయాయి దీంతో లాభాల నుంచి నష్టాల బాటకు మార్కెట్ పతనం మొదలైంది. పార్కింగ్ చేయడానికి స్థలం లేక ప్రతి వీధి సందులో సైకిల్ కుప్పలు కుప్పలుగా పడిపోయాయి 2018లో సగానికి పైగా కంపెనీలు దివాళ తీయడం మొదలయ్యాయి. ఆ కంపెనీల సైకిళ్లు అనాధల్లా రోడ్ల పక్కన పడి ఉండేవి. దీనిపై చైనా ప్రభుత్వం పట్టణాలకు శుభ్రం చేయడానికి సైకిళ్లను డంపింగ్ యార్డ్ లో జమ చేయడం మొదలుపెట్టారు. ప్రతి వీధు సందుల్లో మూలకు ఉన్న సైకిళ్లను డంప్యాడ్లకు తెచ్చి పడేసేవారు. ఈ విధంగా ఒక డంప్ యాడ్ లో సుమారు 2 లక్షల సైకిళ్లు పడి ఉన్నాయి. చైనాలో లెక్క లేనన్ని చిన్న పెద్ద డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ యాడ్స్ ని బై సైకిల్ గ్రేవ్ యార్డ్ పేరుతో పిలుస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పుడు కూడా బైక్ షేరింగ్ ఉంది కానీ వ్యాపారం పెరగడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version