​భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్ సిరి

ఎమ్మిగనూరు, ఆగస్టు 14: ప్రజల నుంచి అందిన వినతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి స్పష్టం చేశారు. “ఒక్క నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మిగనూరులోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్‌లో కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు.

ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్

అనంతరం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలంలో 22-A(1) నిషేధిత జాబితా, చుక్కల భూములు తదితర భూ సమస్యలను పరిష్కరించి, సంబంధిత భూ పత్రాలను రైతులకు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, స్థానిక ఎమ్మెల్యే బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అందజేశారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులు ప్రజలు
భూమి పత్రాలను రైతులకు అందజేస్తున్న జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా, వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలి తెలిపారు. 22-ఏ నిషేధిత భూముల తొలగింపు, రీ-సర్వే, ఇనాం భూములు, పట్టా వ్యత్యాసాల వంటి రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహాలు, పింఛన్లు, తాగునీరు తదితర సంక్షేమ ఫలాలు సకాలంలో చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని అన్నారు.

భూమి పత్రాలను రైతులకు అందజేస్తున్న జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే

ఈ కార్యక్రమంలో ఆర్డీవో అరుణ దేవి, డీపీవో భాస్కర్, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, జిల్లా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్
Back To Top