సత్యసాయి జిల్లా వీర జవాన్ మురళీ నాయక్
కుటుంబానికి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించిన విషయం విధితమే. గురువారం ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గోరంట్ల మండలం కల్లితండాలో వీర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మురళీ నాయక్ సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పించి మీడియాతో మాట్లాడుతూ.. వీర జవాను మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం అని ఆయన త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు. దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్ వీరమరణం పొందారని, మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి లక్ష రూపాయల నగదు ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అందజేశారు.



