Day: August 12, 2026

ఎమ్మెల్యే విరూపాక్షి బెయిల్ పిటిషన్ పై రేపు ఆదోని కోర్టు లో విచారణ

ఆదోని, ఆగస్టు 12: ఆలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు విరూపాక్షి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై రేపు (ఆగస్టు 13, గురువారం) కోర్టులో విచారణ జరగనుంది. నేమకల్లు గ్రామానికి చెందిన ఒక ఎస్సీ మహిళపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్యే విరూపాక్షి మరియు ఆయన సోదరుడిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో న్యాయపరమైన ఉపశమనం కోసం వారు ఆదోనిలోని 2వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి […]

వైఎస్ఆర్‌సీపీ పట్టణాధ్యక్షుడు దేవాకు టూ టౌన్ పోలీసులు నోటీసులు జారీ

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్‌సీపీ పట్టణాధ్యక్షుడు బోయ దేవాకు టూ టౌన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 11న నమోదైన FIR No.152/2026 కేసు దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. BNS సెక్షన్లు 126(2), 189(2), 292 r/w 190 కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం రెండు రోజుల్లోగా తమ ఎదుట హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. హాజరయ్యే సమయంలో గుర్తింపు, […]

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

హోస్పేట: 12.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 12 (బుధవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1627.61 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 85.359 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి […]

Back To Top