విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది.. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

ఆదోని వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి శనివారం ఆదోనిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ◆ ఉద్యోగాల మోసం: ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. డీఎస్సీ ప్రక్రియలో మరియు స్పోర్ట్స్ కోటా జీవోలను మార్చి పార్టీ కార్యకర్తలకే ఉద్యోగాలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ◆ హామీల అమలు ఏది?: ‘సూపర్ సిక్స్’ పథకాలను అరకొరగా అమలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని, మహిళలకు ఇచ్చిన ₹1,500 హామీ, 50 ఏళ్లకే పింఛన్ హామీల ఊసేత్తడం లేదని విమర్శించారు. ◆ శాంతిభద్రతల క్షీణత: ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ దీక్షా శిబిరాన్ని టీడీపీ గుండాలు పెకిలించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని, ఇలాంటి హింసాత్మక చర్యల వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యపరుస్తూ సోమవారం ఆదోనిలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలందరూ ఈ ర్యాలీలో పాల్గొని నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

దీక్ష శిబిరం వద్ద మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

​ఈ కార్యక్రమంలో దీక్షా పరులు చలపతి, తాయన్న, జయరాం, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు బి.దేవా, నాయకులు ఫయాజ్, రహింసాబ్, రామలింగేశ్వర యాదవ్, నల్లారెడ్డి మరియు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దీక్షా శిబిరం వద్ద సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
Back To Top