కర్నూలు జిల్లా ఆదోని పట్టణం రణమండల కొండల్లో నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు సుమారు 300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి నాటుసారా తయారీ సామాగ్రిని నిర్వీర్యం చేశారు. నటుసార తయారు చేస్తున్న హనుమాన్‌నగర్‌కు చెందిన నాగరాజు, నిజాముద్దీన్ కాలనీకి చెందిన హనుమప్పలను , రమేష్ లను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నాటు సారా తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్ కర్నూలు జిల్లా ఆదోని […]
రెచ్చిపోతున్న మట్టి మాఫియా..
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం గ్రామ సమీపంలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. ఆదివారం సెలవు దినం కావడంతో మట్టి మాఫియా రెచ్చిపోయి ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి తీసుకువెళ్తున్నారు. రాజుపాలెం గ్రామ సమీపంలో ఉన్న చెరువు ప్రాంతంలో జెసిబి సహాయంతో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ ద్వారా తరలించి తీసుకువెళ్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు స్పందించడం లేదని అంటున్నారు. సెలవు దినాలు […]
కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ స్కూటర్ సీజ్
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఆలూరు బైపాస్ రోడ్ నుండి బసాపురం వైపు వెళ్లే దారిలో వాహన తనిఖీ చేస్తుండగా అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న బోయగేరికి చెందిన బోయ సూరి, బోయ అర్జున్ లను అరెస్టు చేసిన వన్టౌన్ సీఐ విక్రమసింహ వారి వద్ద నుండి 10 బాక్సలు (912 – 90/180) కర్నాటక లిక్కర్, మద్యం తరలిస్తున్న టీవీఎస్ విగో స్కూటీ స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. […]
ఆదోని పట్టణ ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి …
వేసవి సెలవుల కారణంగా చాలామంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు, టూర్లకు వెళ్లడం జరుగుతుంది. అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎటువంటి విలువైన వెండి గాని బంగారు గాని డబ్బులు గానీ ఇతర విలువైన పత్రాలను కానీ పెట్టి వెళ్ళకండి. దయచేసి వాటిని బ్యాంకు లాకరులో భద్రపరుచుకోండి లేదా మీకు నమ్మకమైన వ్యక్తుల వద్ద ఉంచి వెళ్ళండి.మీరు అలా ఊరికి వెళుతున్నప్పుడు లోకల్ పోలీస్ వారికి మీ యొక్క సమాచారాన్ని అందించండి. అక్కడ పోలీసువారినిఘా పెట్టడం […]
మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ గాళ్లు
మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ గాళ్లు■ కల్తీ దందాపై సైబరాబాద్ ఎస్ఓటి పోలీసుల ఉక్కు పాదం..■ అల్లం పేస్ట్ కల్తీ ముఠా అరెస్ట్..■ బిర్యాని చికెన్ కర్రీలో రుచి కోసం కలిపే అల్లం పేస్ట్ కల్తీ కి పాల్పడుతున్నారు దుండగులు. హైదరాబాద్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో అక్రమంగా కలిసి దందా నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేసి సుమారు 500 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను మరియు 200 లీటర్ల అసిటిక్ యాసిడ్ 550 […]
ఘనంగా బసవేశ్వర కాంస్య విగ్రహం ఊరేగింపు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో శనివారం ఎమ్మిగనూరు బైపాస్ లో ప్రతిష్టించడానికి జరిగిన బసవేశ్వర కాంస్య విగ్రహం ఊరేగింపు ఘనంగా జరిగింది. రాత్రి10 గంటలకు ఎమ్మిగనూరు బైపాస్ కు ఊరేగింపు చేరుకుంది. ఈ కార్యక్రమంలో వీర సేవ లింగాయతి కమ్యూనిటీ బసవేశ్వరుని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కర్ణాటక నుండి రాయచూర్ బళ్ళారి సింధనూరు గంగావతి నుండి అనేకమంది భక్తులు తరలివచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.