ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం గ్రామ సమీపంలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. ఆదివారం సెలవు దినం కావడంతో మట్టి మాఫియా రెచ్చిపోయి ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి తీసుకువెళ్తున్నారు. రాజుపాలెం గ్రామ సమీపంలో ఉన్న చెరువు ప్రాంతంలో జెసిబి సహాయంతో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ ద్వారా తరలించి తీసుకువెళ్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు స్పందించడం లేదని అంటున్నారు. సెలవు దినాలు ఆదివారాలు మట్టి మాఫియా రెచ్చిపోతూ అక్రమంగా మట్టి తరలించి తీసుకువెళ్తున్నారని ఈ విషయంపై అధికారులు దృష్టి సారించి మట్టి మాఫియా కు చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.