కర్నూలు జిల్లా ఆదోని పట్టణం రణమండల కొండల్లో నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు సుమారు 300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి నాటుసారా తయారీ సామాగ్రిని నిర్వీర్యం చేశారు. నటుసార తయారు చేస్తున్న హనుమాన్‌నగర్‌కు చెందిన నాగరాజు, నిజాముద్దీన్ కాలనీకి చెందిన హనుమప్పలను , రమేష్ లను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
నాటు సారా తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసా మసీదు సమీపం లో ముగ్గురు వ్యక్తులు హనుమాన్ నగర్ కు చెందిన బోయ రమేష్ , బోయ నాగరాజు, బోయ హనుమప్ప సంచులు పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని సోదా చెయ్యగా వారి వద్ద నిషిద్ద నాటు సారాయి 20 లీటర్ల ఉండగా వారిని పట్టుకొని అరెస్టు చేసి కేసు నమౌదు చేసినట్లు 1 టౌన్ CI విక్రమసింహ తెలిపారు ఈ సోదాలలో సిబ్బంది రంగస్వామి, సుధీర్, ముస్తాక్ మరియు ఏక వీర లు పాల్గొన్నారు.