కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ప్రతి స్కూల్ బస్సుకి డ్రైవర్ తో పాటు క్లీనర్ కూడా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శిరీష దీప్తి గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు శశిధర్ మాట్లాడుతూ పట్టణంలోని ఉన్న ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో స్కూలు బస్సులు సరైన ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ విద్యార్థులు ప్రాణాలతో చలగాటం ఆడుతున్న పాఠశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



