విద్యార్థుల హక్కులను హరించేటువంటి జీవోను రద్దు చేయండి డి.ఎస్.ఎఫ్

విద్యార్థుల హక్కులను హరించేటువంటి జీవోను తక్షణమే రద్దు చేయాలని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అంబేద్కర్ సర్కిల్ వద్ద డి.ఎస్.ఎఫ్ విద్యార్థులు సంఘం నాయకులు నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ వినోద్ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించిన విద్యాశాఖ అధికారుల ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజాస్వామ్య విరుద్ధం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నిరసన చేస్తున్న డి.ఎస్.ఎఫ్ విద్యార్థులు సంఘం నాయకులు

ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు తప్పవని అన్నారు. విద్యార్థుల హక్కులను హరించేలా పాఠశాలల్లో విద్యార్థి సంఘాలు మరియు ఇతర రాజకీయ పార్టీలు ప్రవేశించకుండా నిషేధిస్తూ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు. విద్యార్థి సంఘాలు రాజకీయం కోసం కాదని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, విద్యార్థుల హక్కుల కోసం, విద్యా రంగంలో ఉన్న అన్యాయాలపై పోరాటాలు నిర్వహిస్తాయని గుర్తు చేశారు. ఈ పద్ధతిలో విద్యార్థి సంఘాలపై నిషేధం విధించి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే చర్య అని ఆరోపించారు. ఇప్పటికైనా ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులంతా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో DSF నాయకులు హరి విక్రమ్ కిరణ్ రవితేజ తదితరులు పాల్గొనడం జరిగింది.

మీడియాతో మాట్లాడుతున్న డి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version