కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాలలో 13/09/2025 2వ శనివారం రోజులన ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆదోన విద్యుత్ శాఖ APSPDCL అధికారులు తెలిపారు. 132/32 KV, 33/11 KV సబ్-స్టేషన్లు, విద్యుత్ లైన్లు మరియు ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున ఆదోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులందరూ సహకరించాలని అధికారులు కోరారు. ఏదైనా అసౌకర్యం కలిగితే చాలా చింతిస్తున్నామన్నారు.
కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి
కర్నూలు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన డా.ఏ. సిరి మేడంను కర్నూలు స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిసారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. ఆదోని సబ్ కలెక్టర్
కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలో కొనసాగుతున్న వరుస వర్షాల దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత విభాగాల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్ శ్రీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. శుక్రవారం రామ్ జల చెరువు మరియు లోతట్టు ప్రాంతాలను అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, ఇరిగేషన్, మునిసిపల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ తో మాట్లాడుతూ… ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణను కట్టుదిట్టంగా చూసుకోవడమే కాకుండా అవసరమైన చోట్ల తక్షణ […]
రైతు కంటతడి పెడుతున్నాడు
కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యాడ్ లో రైతులకు యూరియా అందించాలి అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డీ ఎస్ ప్ విద్యార్థి సంఘం నాయకులు. అనంతరం విలేకరుల సమావేశంలో DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రైతులు ఈరన్న, సిద్ధ లింగ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో మండల కేంద్రాల్లో రైతులకు యూరియా అందక యూరియా కోసం షాపుల దగ్గర గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి ఏర్పడిందని […]
కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా గుడిసె కృష్ణమ్మ
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం విజయనగర్ కాలనిలో నివాసం ఉంటున్న షాహిన్ అనే మహిళ భర్త 18రోజుల క్రితం గుండె పోటుతో చనిపోయాడు. ఆ మహిళ కు 5 మంది సంతానం అందరూ అడపిల్లలె కుటుంబ భారం మోయలేక ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి టిడిపి నాయకురాలు గుడిసె కృష్ణమ్మ అండగా నిలబడ్డారు ఆ కుటుంబానికి నేనున్నానని భరోసా కల్పించి 20 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేనున్నాను భయపడొద్దండి అని […]
అహోబిలం అనే వ్యక్తి దారుణ హత్య
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామ శివారులో అహోబిలం (28) అనే వ్యక్తి ని గుర్తుతెలియను వ్యక్తులు దారుణంగా కత్తితో దాడిచేసి హత్య చేశారు. కత్తితో పలుచోట్ల దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య గంగమ్మ , ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బంధువు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మృతుడు అహోబిలం భార్య […]
ఇంట్లో దొంగలు పడ్డారు
ఆదోని సింహపురి , లక్ష్మీ ఎస్టేట్ లోదొంగలు హల్చల్..తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు…కర్నూలు జిల్లా ఆదోని పట్టణం సింహపురి కాలని లక్ష్మీ ఎస్టేట్ లో ప్రభుత్వ ఉద్యోగి వంశీకృష్ణ ఇంట్లో దొంగ5 చోరికి పాలుపడ్డారు. సుమారు 6 తులాల బంగారు 400 గ్రాముల వెండి చోరి అయినట్లుగా బాధితుడు వంశీ కృష్ణ తెలిపారు. వంశీకృష్ణ తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి.. కుక్కలకు మత్తు బిస్కెట్లు తినిపించి కుక్కను కటేసి ఇంటి మిద్దపై పెట్టి చోరికి […]
గణనాథుడు గంగమ్మ ఒడికి వెళ్లడానికి శోభాయాత్ర ప్రారంభం
కర్నూలు జిల్లా ఆదోని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనంకు మొదటి గణపతి పూజలు నిర్వహించారు. శోభాయాత్ర నిర్వహించిన గణేష్ పూజలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మదిరే భాస్కర్ రెడ్డి, గుడిసె కృష్ణమ్మ పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన లడ్డూ వేలంపాటలో 3 లక్షల 60 వేలకు టిడిపి యువ నాయకుడు మారుతి నాయుడు దక్కించుకోగా హుండీ వేలంపాటలో 1 […]
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి.. ఆదోని సబ్ కలెక్టర్
కర్నూలు జిల్లా ఆదోనిలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. గురువారం ఆదోని పట్టణంలో నిమజ్జనం వెళ్లే ప్రధాన దారి అయినా , తిక్క స్వామికి దర్గా, ఎమ్మిగనూరు సర్కిల్, బీమా సర్కిల్, ఫరిసా మోహల్ల, శ్రీనివాస్ భవన్, గణేష్ సర్కిల్, న్యూ ఫ్లైవర్, వినాయక ఘాట్ ప్రధాన దారులను తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… నిమజ్జనం కు ఎటువంటి ఆటంకం లేకుండా […]
కుక్క దాడి 10 మందికి గాయాలు
కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెలగల్ గ్రామంలో పిచ్చికుక్క గ్రామస్తులపై దాడి చేయడంతో 10 మందికి గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరికీ మస్తాన్ సాబ్ (68), గౌతమ్ (8) కు తీవ్ర గాయాలు కావడంతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 8 మందిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బాధ్యులు తెలిపారు.