కర్నూలు జిల్లా ఆదోని పట్టణం విజయనగర్ కాలనిలో నివాసం ఉంటున్న షాహిన్ అనే మహిళ భర్త 18రోజుల క్రితం గుండె పోటుతో చనిపోయాడు. ఆ మహిళ కు 5 మంది సంతానం అందరూ అడపిల్లలె కుటుంబ భారం మోయలేక ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి టిడిపి నాయకురాలు గుడిసె కృష్ణమ్మ అండగా నిలబడ్డారు ఆ కుటుంబానికి నేనున్నానని భరోసా కల్పించి 20 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేనున్నాను భయపడొద్దండి అని ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు. ఆ మహిళలకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. అదేవిధంగా ఆదోని ప్రజలు అందరూ ఆమెకు అండగా నిలబడాలని తమ వంతు సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. వారికి కనీసం ఫోన్ పే లేదని పింజరి షాహిన్ అనే మహిళకు బ్యాంక్ ఖాతాకు 37038100007929 తోచిన సహాయం చేయాలని సూచించారు.