గణనాథుడు గంగమ్మ ఒడికి వెళ్లడానికి శోభాయాత్ర ప్రారంభం

కర్నూలు జిల్లా ఆదోని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనంకు మొదటి గణపతి  పూజలు నిర్వహించారు. శోభాయాత్ర నిర్వహించిన గణేష్ పూజలో  మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మదిరే భాస్కర్ రెడ్డి, గుడిసె కృష్ణమ్మ పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన లడ్డూ వేలంపాటలో 3 లక్షల 60 వేలకు టిడిపి యువ నాయకుడు మారుతి నాయుడు దక్కించుకోగా హుండీ వేలంపాటలో 1 లక్షల 16 వేలకు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ దక్కించుకున్నరు. అనంతరం విశ్వహిందూ పరిషత్ గణనాథుడు గంగమ్మ ఒడికి వెళ్లడానికి శోభాయాత్రను ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఆదోని పట్టణంలో ఏర్పాటుచేసిన 448 గణేష్ విగ్రహాల శోభాయాత్రకు వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు మధ్య డ్రోన్ సీసీ కెమెరాలతో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.

పూర్తి వీడియో చూడాలంటే దీనిపై క్లిక్ చేయండి
శోభాయాత్రకు బయలుదేరిన నాయకులు
విశ్వహిందూ పరిషత్ గణనాథుని పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఎమ్మెల్సీ బిటి నాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version