దేవాలయ నిర్మాణానికి 44 వేల రూపాయల విరాళం

కర్నూలు జిల్లా కురువ సంఘం అద్వర్యం లో పెద్దపాడు సమీపం లోని ఆదర్శ పాఠశాల సమీపం నిర్మాణం లో ఉన్న శ్రీ భీరలింగేశ్వర స్వామి దేవాలయము నిర్మాణం కోసం గూడూరు మండలం కే. నాగలాపురం గ్రామానికి చెందిన సుంకన్న 44 వేల రూపాయల నగదును అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న కర్నూలు జిల్లా కురువ సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కే . రంగస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు బి. వెంకటేశ్వర్లుకి నగదు అందజేశారు .
ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కే. రంగస్వామి మాట్లాడుతూ దాతల సహకారంతో గోపురం నిర్మాణం మరియు అమీలియా హాస్పిటల్ అధినేత డా. ప్రసాద్ సహకారంతో ప్రహారీగోడ నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. దేవాలయము నిర్మాణ పనులు ఇంక ఉన్నాయని దాతలు ముందుకు వచ్చి నిర్మాణం కోసం భారీ విరాళాలు అందజెసి సహకరించలని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు కొత్తపల్లె దేవేంద్ర, పెద్దపాడు పుల్లన్న, బి.సి. తిరుపాలు, నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version