సంక్షేమ పథకాలు ఇవ్వలేను అని చెప్పటం సిగ్గుచే.. మాజీ ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ విలేకరుల సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు రోజుల క్రితం స్వయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది సంక్షేమ పథకాలు ఇవ్వలేను అని చెప్పటం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఆలోచించకుండా సూపర్ సిక్స్ ఎలా హామీ ఇచ్చారని ప్రశ్నించారు. హామీలు ఇచ్చేటప్పుడు కూటమి నాయకులు కు తెలియదా అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు అవసరమైన విద్య, వైద్యం నిర్వీర్యం చేశారని ఆరోజుల్లో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు దానిని రెండు లక్షల నుంచి 25 లక్షలు వరకు పెంచారు.. కారోణా సమయంలో కూడా నవరత్నాలు అమలు చేసి చూపించారు కానీ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని జనాలని మోసం చేశారని తెలిపారు. ఎలక్షన్లో ఓట్ల కోసం సూపర్ సిక్స్ ని వాడుకొని ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని అన్నారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. గ్రామ స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో  బడుగు బలహీన వర్గాల పిల్లలకు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి చూస్తున్నాం అన్నారు. ఏ విధంగా చూసినా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అయిందనిద ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుస్తుందని తెలిపారు. దీనిని ప్రజలందరూ గమనిస్తున్నారని రాష్ట్ర ప్రజలు ఆలోచించి రానున్న ఏ ఎలక్షన్ లో నైనా వారికి బుద్ధి చెప్పాలని కోరారు. ప్రజల ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version