కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 26500/= విలువ చేసే 34 బాక్సులు (3360 పెట్రా ప్యాకెట్లు) మరియు ఒక అప్పి ఆటో ను వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం వారిని డీఎస్పీ వినోద్ కుమార్ ముందు హాజరు పరిచి సి.ఐ. విక్రమ సింహ రిమాండ్ కు తరలించారు. కష్టపడి పనిచేసిన పోలీసులకు డిఎస్పీ వినోద్ కుమార్ చేతుల మీదుగా నాగరాజు, మధు, రంగస్వామి కానిస్టేబుల్ లకు రివార్డులు అందజేశారు.