జులై 1వ తేదీ నుండి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలలో జగనన్న సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించేందుకు సంకల్పించిన గొప్ప కార్యక్రమమని ఆదోని టౌన్ 2కన్వీనర్ వెల్లాల మధుసూదన శర్మ అన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని 11, 20, 26, 27, మున్సిపల్ వార్డులలో, చైర్మన్ బోయ శాంతమ్మ, కౌన్సిలర్ వాసీం, వార్డు ఇంచార్జులు,మధు, హాజీబాష అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యమముపైన వార్డు కన్వీనర్లకు, వాలెంటీర్స్, మరియు గృహసారధులకు అవగాహన సదస్సు నిర్వహించరు. కార్యక్రమములో టౌన్ కన్వీనర్ వెల్లాల మధుసూదన శర్మ మాట్లాడుతూ జూలై 1నుండి 25వరకు ప్రభుత్వం తలపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమములో అందరు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న సురక్ష కార్యక్రమము గురించి వివరంగా చెప్పి అర్హులై ఉండి సంక్షేమ పథకాలు ఎవరికైతే అందడంలేదో తెలుసుకుని వారి నుండి పథకానికి అవసరమైన పత్రాలు తీసుకుని సచివాలయ సిబ్బందికి అందచేసి, సచివాలయంవారు ఇచ్చే టోకెన్ నెంబర్ లబ్దిదారులకు తెలియచేసి ప్రభుత్వం నిర్ణయించిన తేదీలలో మన సచివాలయములో ఉన్నతాధికారులతో నిర్వహించే జగనన్న సురక్ష కార్యక్రమానికి లబ్దిదారులను పిలుచుకుని వచ్ఛి ఉన్నతాధికారులతో తగిన సర్టిఫికెట్ ఇప్పించడమే కాకుండా,ఆ సర్టిఫికెట్ ద్వారా లబ్దిదారులకు రావలసిన పథకానికి అప్లై చేయించి ప్రతి పేద లబ్దిదారుడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాడానికి చూడాలని నియోజకవర్గ అభివృద్ధికి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకులు ఆదోని ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ రెడ్డి, మరియు వైఎస్సార్ పార్టీ యువనేత వై జయమనోజ్ రెడ్డి కి మనవంతు సహాయ సహకారాలు అందించి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని గెలుపు సహకరించాలని మధుసూదన శర్మ నాయకులను, గృహసారధులను, మరియు హాజరైన నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో వాలెంటీర్స్ టౌన్ ఇంచార్జులు అమిత్, సందీప్, నాయకులు బోయ నాగేంద్ర, మహబూబ్ బాషా, నూరుబాష,షాహిన, మారుతి, వెంకటేష్,దుర్గేష్ మొదలైన వారు పాల్గొన్నారు.