పెహెల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన సామాన్య ప్రజల ఆత్మకు శాంతి కలగాలని
కర్నూలు జిల్లా ఆదోని భీమాస్ సర్కిల్లో కొవ్వొత్తులు వెలిగించి ముస్లిం జేఏసి నాయకులు సంతాపం ప్రకటించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించరు. కన్వీనర్ నూర్ అహ్మద్ మాట్లాడుతూ శత్రువులను కూడా క్షమించడమే మహమ్మద్ ప్రవక్త బోధన దానికి విరుద్ధంగా ఉగ్రవాదులు తాము ముస్లింలను చెప్పుకుంటూ సామాన్యులను చంపడం ఇస్లాంకు విరుద్ధమైన చర్య.దీన్ని ప్రతి ముస్లిం ఖండిస్తున్నారు అన్నారు. ఉగ్రవాదులను వెంటనే అరెస్ట్ చేసి ఎర్రకోట ముందు బహిరంగంగా భారతదేశ ప్రజలందరూ చూస్తుండగా తలలు నరికి వేయాలని నూర్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా వారికి ఆదోని ముస్లిం జేఏసి అండగా నిలబడుతుందని మద్ధతు ప్రకటించారు. మతసామరస్యం, దేశసమగ్రత కోసం ఆదోని ముస్లిం జేఏసీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
నాయకులు మహ్మద్ నూర్, సద్దాం హుస్సేన్, మన్సూర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉగ్రవాదు దాడులు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని అదేవిధంగా నిందితులను కఠినాతి కఠినంగా బహిరంగ శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సంతాప సభలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, సేవా సంఘాల నాయకులు కన్వీనర్ నూర్ అహ్మద్, కో కన్వీనర్ మహమ్మద్ నూర్ ,నాయకులు లాయర్ సద్దాం హుస్సేన్, వసీం సాహెబ్, అర్షద్, మన్సూర్ , ఇస్మాయిల్, కౌన్సిలర్ హాజీ, ఫారుఖ్, జీలాన్, షకీల్ మరియు ముస్లిం యువత పాల్గొన్నారు.